వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ 'లెక్క'ను సరిజేస్తున్న అరవింద్ కేజ్రీవాల్!

|
Google Oneindia TeluguNews

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయంతో మంచి జోరుమీదున్న ఆమ్ ఆద్మీ గుజరాత్ లోను పాగా వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. పంజాబ్ లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించామో.. అదే వ్యూహాన్ని గుజరాత్ లో కూడా అమలు చేస్తోంది. తాజాగా ప్రచారాన్ని ప్రారంభించిన ఆప్ 'Choose Your Chief Minister' పేరుతో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంచుకోవడానికి ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సూరత్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కూడా ఇందులో పాల్గొన్నారు.

ప్రజలే ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి

ప్రజలే ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి

గుజరాత్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైందని, ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో ప్రజలే చెప్పాలని కోరుతున్నామని, అందుకే మొబైల్ నెంబరు, మెయిల్ ఐడీని అందుబాటులోకి తెచ్చినట్లు అరవింద్ వెల్లడించారు. 63570 00360 నెంబరుకు వాట్సాప్ లేదా వాయిస్ మెసేజ్, ఎస్ఎంఎస్ పంపించవచ్చని, ప్రజలంతా ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు. aapnocmgmail.com ఐడీకి ఇ-మెయిల్ కూడా చేయవచ్చన్నారు. నవంబరు మూడోతేదీ సాయంత్రం ఐదుగంటల్లోగా ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.

పంజాబ్ లో భగవంత్ మాన్ కు 93 శాతం ఓటింగ్

పంజాబ్ లో భగవంత్ మాన్ కు 93 శాతం ఓటింగ్


2022 ఆరంభంలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమ్ ఆద్మీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఓటుద్వారా ముఖ్యమంత్రి అభ్యర్థిని గుర్తించేందుకు ఈ పద్ధతిని ఎంచుకుంది. ఈ ప్రక్రియకు పంజాబ్ ప్రజల నుంచి విశేషమైన స్పందన వ్యక్తమైంది. 21.59 లక్షల స్పందనలు రాగా అందులో 93.0 శాతం మంది భగవంత్ మాన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంచుకోవడంతో పార్టీ ఆయన పేరే ఖరారు చేసింది. ప్రస్తుతం గుజరాత్ లోను ఇదే వ్యూహంతో మందుకు వెళుతోంది.

సర్వేలన్నీ ఆప్ కు అనుకూలంగా?

సర్వేలన్నీ ఆప్ కు అనుకూలంగా?


గుజరాత్ అసెంబ్లీకి ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగబోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ తోపాటు గుజరాత్ కుడా ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ప్రకటన వెలువడలేదు. రాష్ట్రంలో బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. పోలింగ్ సరళి ఆప్ కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా బీజేపీని లక్ష్యంగా ఎంచుకొని ప్రచారం చేస్తున్నారు. ఓటమి భయంతోనే ఇంతవరకు షెడ్యూల్ ను ప్రకటించకుండా వాయిదా వేయించారని ఆయన మోడీ, అమిత్ షాపై మండిపడ్డారు.

English summary
The Aam Aadmi Party, which is in a good mood after its great victory in the Punjab Assembly elections, is working hard to make a foothold in Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X