సీఎం యోగి బాటలో ఢిల్లీ సర్కార్.. ఇక్కడా ఆ సెలవుల రద్దు
ఢిల్లీ సర్కారు కూడా యూపీ సర్కారు బాటలో నడవనుంది. ప్రముఖుల జయంతి, వర్ధంతి సందర్భంగా ప్రస్తుతం ఉన్న సెలవులను రద్దు చేయనున్నట్టు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు.
ఢిల్లీ: రాజకీయాల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రత్యర్థులు. ఒక పార్టీ అంటే మరో పార్టీకి పడదు. అయినా సరే, బీజేపీ ఫైర్ బ్రాండ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాటలో ఢిల్లీ సర్కార్ నడవనుంది.
ప్రముఖుల జయంతి, వర్ధంతి సందర్భంగా ప్రస్తుతం ఉన్న సెలవులను రద్దు చేయనున్నట్టు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. ఆయా రోజుల్లో సెలవులు ఉండవని, పనిదినాలుగా పరిగణిస్తామని తెలిపారు.

యూపీలో ప్రముఖుల జయంతులు, వర్ధంతుల సందర్భంగా ఇస్తున్న సెలవుల్లో 15 రద్దు చేస్తున్నట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖుల జయంతులప్పుడు స్కూళ్లకు సెలవులు ఇవ్వొద్దని, ఆ రోజు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి వాళ్ల గొప్పదనం గురించి రెండు గంటల పాటు పిల్లలకు చెప్పాలని కూడా ఆయన పేర్కొన్నారు.
ఇప్పుడు ఢిల్లీ సర్కారు కూడా ఇదే బాట పట్టనుంది. అయితే ఎన్ని సెలవులు, ఎవరెవరికి సంబంధించినవి రద్దు చేయబోతోందో ఇంకా ప్రకటించలేదుగానీ.. మొత్తానికి సెలవులు రద్దు చేయాలనే నిర్ణయం మాత్రం తీసుకుంది. మున్ముందు ఈ బాటలో మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పయనించే అవకాశం లేకపోలేదు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications