రాజీనామాకు క్షమించండి, ఎన్నికలకు రెడీ: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మరోసారి ప్రయత్నించబోమని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థుతుల్లో తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని అందువల్ల ఎన్నికలకే మొగ్గు చూపుతున్నామని ఆయన వివరించారు. ప్రజల్లో తమ పార్టీపై ఆదరణ తగ్గలేదని ఆయన అన్నారు.

ఢిల్లీలో తమ పార్టీ ప్రభుత్వాన్ని వదులుకున్నందుకు మాత్రమే ప్రజలు తమపై కోపంగా ఉన్నారన్నారు. తాము తమ సిద్ధాంతాలతో రాజీపడడం లేదని భావించామని, అందుకే రాజీనామా చేశామని అయితే తమ నిర్ణయాన్ని ప్రజలు తప్పుగా భావించారన్నారు. అందుకు ప్రజలకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పారు.

AAP prepares for fresh polls in Delhi, Kejriwal apologizes for quitting midway

ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నామని అందువల్ల ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజాభిప్రాయం కోరాలని భావించామన్నారు. ఆ కారణంగానే మంగళవారంనాడు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను కలిసి అసెంబ్లీని రద్దు చేయొద్దని కోరామన్నారు.

అయితే కాంగ్రెస్, బిజెపిల్లో ఏ ఒక్కరూ మద్దతిచ్చే పరిస్థితి లేనందున ఇక ఢిల్లీ అసెంబ్లీకి ఎన్కలు తప్ప మరో మార్గం లేదని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. తమ పార్టీ సమావేశమై ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+