అమిత్ షాపై 48 గంటల నిషేధం విధించండి, ఈసీని కోరిన ఆప్, ఎందుకంటే..?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఆప్-బీజేపీ మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. అది తప్పు అని ఆప్ ఆరోపించింది. తప్పుడు వీడియో ప్రదర్శించిన అమిత్ షాపై చర్యలు తీసుకోవాలనిఎన్నికల సంఘాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కోరింది. ఈ మేరకు ఆప్ నేతలు సంజయ్ సింగ్, పంకజ్ గుప్తా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

48 గంటలు బ్యాన్..?
అమిత్ షాపై 48 గంటల ప్రచారం నిషేధం విధించాలని ఆప్ నేతలు కోరారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు సరిగాలేవని అమిత్ షా తప్పుడు వీడియో పోస్ట్ చేశారని పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన గౌతం గంభీర్, పర్వేశ్ వర్మ, హన్స్ రాజ్ తప్పుడు వీడియోను అమిత్ షాకు అందజేశారని పేర్కొన్నారు. పాఠశాల వీడియోకు కొన్ని మార్పులు చేసి.. సదుపాయాలు లేవనేటట్టు చేశారని పేర్కొన్నారు. ఆ వీడియోలు అందజేసిన ముగ్గురు ఎంపీలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎంపీలపై కేసు
ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిసి ఢిల్లీలో అమిత్ షా ప్రచారంపై నిషేధం విధించాలని కోరారు. ఆ వీడియోను అందజేసిన ఎంపీలపై కేసు కూడా నమోదు చేస్తామన్నారు. ఢిల్లీ స్కూల్స్‌లో సౌకర్యాలు లేవనే ట్వీట్లను కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము చట్టపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు.

కేజ్రీవాల్ ఫైర్
అమిత్ షా షేర్ చేసిన వీడియోలు మార్పింగ్ చేసినవి అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆప్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఢిల్లీలో విద్యావ్యవస్థ తీరు మారిపోయిందని చెప్పారు. కానీ అమిత్ షా మాత్రం 16 లక్షల మంది విద్యార్థులను 32 లక్షల మంది తల్లిదండ్రులను అవమానించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

నో విజన్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్, విజన్ లేని బీజేపీ తప్పుడు వీడియోలను ప్రదర్శించి లబ్ది పొందాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. అంతేకాదు విద్యా వ్యవస్థనే కించపరిచేలా అమిత్ షా వ్యవహరించారని పేర్కొన్నారు. అమిత్ షా ఢిల్లీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులే కాక టీచర్లకు కూడా క్షమాపణ చెప్పాలని సంజయ్ సింగ్ తెలిపారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications