వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హస్తినలో మళ్లీ ఆపే, 54-60 సీట్లతో అధికారం, వెల్లడించిన టైమ్స్ నో పోల్, బీజేపీకి 10-14 సీట్లే..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Delhi Assembly Elections Opinion Poll : AAP to Win 54-60 out of 70 seats, BJP May Bag 10-14

ఢిల్లీ ప్రజలు మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కడతారని 'టైమ్స్ నో' పోల్ అంచనా వేసింది. ఢిల్లీ అసెంబ్లీలో 54 నుంచి 60 సీట్లను ఆప్ గెలుచుకుంటుందని లెక్కగట్టింది. బీజేపీ కేవలం 10 నుంచి 14 సీట్లకే పరిమితం అవుతోందని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంటుందని తెలియజేసింది.

ఆప్‌కు మళ్లిన ఓటుబ్యాంకు

ఆప్‌కు మళ్లిన ఓటుబ్యాంకు


అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏడు సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. సంవత్సరంలో బీజేపీ ఓటుబ్యాంకు కూడా ఆప్‌కు మళ్లడం విశేషం. ఢిల్లీలో ఆప్ ఓటుబ్యాంకు 52 శాతం ఉండగా, బీజేపీ 34 శాతానికి పడిపోయింది. ఏడాదిలో బీజేపీ ఓటు శాతం 18 తగ్గింది. 2015 అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా.. తిరిగి ఓటుశాతం ఆప్‌కి చేరింది. గత ఎన్నికలతో ఆప్ 2.5 శాతం ఓటు శాతం తగ్గగా.. బీజేపీ స్వల్పం 1.7 శాతం పుంజుకొని ఫరవాలేదు అనిపించింది.

38 శాతం నుంచి..

38 శాతం నుంచి..

లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ ఓటు షేర్ బీజేపీకి 46 శాతం ఉండగా, ఆప్ 38 స్థానంలో ఉంది. కానీ ఏడాదిలోని ఆప్ తన ప్రభను తిరిగి సంపాదించుకోగలిగింది. అయితే ప్రధానమంత్రి పదవీకి మాత్రం నరేంద్ర మోడీ అర్హుడని పేర్కొనడం విశేషం. 75 శాతం ప్రజలు మోడీ ప్రధాని ఉండటాన్ని స్వాగతిస్తున్నారు. రెండో స్థానంలో ఉన్న రాహుల్ గాంధీ మాత్రం 8 శాతం దక్కించుకోవడం విశేషం.

అనుకూలం-ప్రతీకూలం

అనుకూలం-ప్రతీకూలం

పౌరసత్వ సవరణ చట్టం నిర్ణయాన్ని 71 శాతం ప్రజలు అనుకూలంగా ఉన్నారు. 52 శాతం మంది మాత్రం షహీన్ బాగ్ ఆందోళనను వ్యతిరేకించారు. ఇందులో 25 శాతం మంది మాత్రం నిరసనలు సబబేనని అభిప్రాయపడ్డారు. మరో 24 శాతం మంది మాత్రం తమ అభిప్రాయాన్ని పంచుకోలేదు. ఢిల్లీలో 7 వేల 321 మంది నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలను తెలుసుకొని సర్వే రూపొందిచారు. జనవరి 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు సర్వే నిర్వహించారు.

English summary
aap is poised to sweep the delhi assembly elections winning beyween 54 to 60 seats in the 70 member house
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X