బీజేపీలో ఏడుగురు సీఎం అభ్యర్థులు, అందరికీ హ్యపీ న్యూ ఇయర్, ఆమ్ ఆద్మీ పార్టీ..

న్యూ ఇయర్ వేళ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నేతలపై సెటైర్లు వేసింది. అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. బీజేపీ నేతలకు మాత్రం భిన్నరీతిలో విష్ చేసింది. బీజేపీలో ఏడుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని, వారికి న్యూ ఇయర్ అంటూ ట్వీట్ చేసింది.

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పోస్టర్ ఏర్పాటుచేసి అందులో గౌతం గంభీర్, మనోజ్ తివారీ, విజయ్ గోయల్, హర్దీప్ సింగ్ పురీ, హర్షవర్ధన్, విజేందర్ గుప్తా, పర్వేశ్ సింగ్ పేర్లను ప్రస్తావించింది. అయితే వీరిలో ఎవరూ తనపై పోటీచేస్తారోనని ఆప్ పార్టీ పేర్కొనడం గమనార్హం. తర్వాత బ్యానర్ ఉన్న ఫోటోను ట్వీట్ చేసింది.

AAP wishes new year to BJP’s ‘all seven CM candidates..

మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ఢిల్లీ బీజేపీ ఇంచార్జీ ప్రకాశ్ జవదేకర్ మాత్రం సరైన సమయంలో పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చారు. మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులను వెంటనే ప్రకటించే బీజేపీ.. ఢిల్లీ విషయంలో మాత్రం జాప్యం చేస్తోంది. దీంతో ఆప్ పార్టీ తనదైన శైలిలో స్పందించింది. అయితే జనవరి మొదటివారంలో ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+