Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల్లో పోటీచేసేందుకు కనీస వయసు 21 చేయాలి..!!

ప్రజాస్వామ్య దేశాల్లో భారత్ అత్యంత పిన్న వయస్కురాలున్న దేశమని రాజ్యసభ సభ్యులు ఆమ్‌ఆద్మీ పార్టీ నేత రాఘవ చద్దా అన్నారు. రాజ్యసభలో మాట్లాడిన ఆయన అత్యంత పిన్న వయస్సు కలిగి ఉన్న భారత్‌లో రాజకీయ నాయకులు మాత్రం అత్యంత పెద్ద వయసున్నవారని చెప్పారు. అందుకే ఎన్నికల్లో పోటీచేసేందుకు కావాల్సిన వయస్సు 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు కుదించాలని డిమాండ్ చేశారు. అలా అయితే చట్టసభల్లో యువనాయకత్వం కనిపిస్తుందని అన్నారు. భవిష్యత్తు యువతరానిదే అన్నప్పుడు చట్టసభల్లో వారికి ప్రాధాన్యత పెంచాలని అన్నారు.

ఎన్నికల్లో పోటీచేయాలంటే కనీస వయస్సును 25 ఏళ్లు ఉండాలనిరాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. మన దేశ జనాభాలో 65శాతం జనాభా 35 ఏళ్ల కంటే తక్కువగా ఉన్నారు, 50శాతం జనాభా 25 ఏళ్ల వయసు కంటే తక్కువగా ఉన్నారని చెప్పారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏర్పాటైన తొలి లోక్‌సభలో 26శాతం మంది సభ్యులు 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారుండేవారని గుర్తు చేశారు. అయితే రెండ నెలల క్రితం కొత్తగా ఏర్పాటైన 17వ లోక్‌సభలో 12శాతం మంది సభ్యులు 4 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారున్నారని చెప్పారు.

AAPs Raghav Chadha Proposes 21 as Minimum Age for Electoral Candidates

యువ దేశంలో వృద్ధ రాజకీయ నాయకులు ఉన్నారని యువతకు ప్రాధాన్యత ఇచ్చేలా ఎన్నికల్లో పోటీచేసే వయసును 21 ఏళ్లకు కుదించాలని చెప్పారు.యువ రాజకీయ నాయకులతో యువదేశంగా భారత్ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.ఇది ప్రభుత్వానికి ఒక సూచన మాత్రమే తాను చేస్తున్నట్లు రాఘవ్ చద్దా చెప్పుకొచ్చారు. రాజకీయాలపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదని చెప్పిన రాఘవ్ చద్దా... తల్లి దండ్రులు వారి పిల్లలను ఒక డాక్టర్‌గానో లేదా ఇంజినీర్‌గానో లేదా క్రీడాకారుడిగానో అవ్వాలని చెబుతున్నారని చెప్పారు. రాజకీయాల్లోకి ఎందుకు పంపడం లేదని రాఘవ్ చద్దా సభలో ప్రశ్నించారు.

రాజకీయ నాయకుడు లేదా రాజకీయాల్లో చేరమని ఎవరూ ప్రోత్సహించరని, అయితే రాజకీయాల్లో ఉంటే దేశానికి ఎంత మంచి చేయగలమో అన్న విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలని అన్నారు. ఒక నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రజలకు ఉండాల్సిన అర్హత 18 ఏళ్లు అయినప్పుడు ఒకరు చట్టసభల్లో ఎంట్రీ ఇచ్చేందుకు లేదా పోటీచేసేందుకు 21 ఏళ్ల వయసు ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వం చట్టసభల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు రాఘవ్ చద్దా. 2012లో ఆమ్‌ ఆద్మీ పార్టీ పుట్టినప్పటి నుంచి రాఘవ్ చద్దా ఆ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం 35 ఏళ్లు వయసున్న రాఘవ్ చద్దా... పంజాబ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసేవారు. ఆమ్‌ ఆద్మీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రాఘవ్ చద్దా అత్యంత సన్నిహితులు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+