ఆరుషి హత్య కేసు: తల్లిదండ్రులు నిర్దోషులే, అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరుషి తల్వార్ హత్య కేసులో అలహాబాద్ హైకోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న అరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా పేర్కొంది.
Recommended Video

అలహాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసులో అలహాబాద్ హైకోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ఘజియాబాద్ జైలు శిక్ష అనుభవిస్తున్న ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా పేర్కొంది.
నోయిడాలోని జలవాయి విహార్‌లో 2008 మే 16న ఆరుషి తల్వార్(14) హత్యకు గురైంది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులైన నూపుర్ తల్వార్, రాజేష్ తల్వార్‌లు ఇంటి పనిమనిషి హేమరాజ్‌తో కలిసి హత్య చేసినట్టు ఉత్తరప్రదేశ్ కోర్టు 2013లో తీర్పుచెబుతూ నూపుర్, రాజేష్ తల్వార్‌లకు జీవిత ఖైదు విధించింది.

అయితే ఈ తీర్పుపై ఆరుషి తల్లిదండ్రులు చేసుకున్న అప్పీల్‌పై జస్టిస్ బీకే నారాయణ, జస్టిస్ ఏకే మిశ్రాలతో కూడిన హైకోర్టు బెంచ్ గత సెప్టెంబర్‌లో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది.
తాజాగా గురువారం సాయంత్రం అలహాబాద్ హైకోర్టు బెంచ్ తన తీర్పును ప్రకటించింది. ఆరుషిని తల్లిదండ్రులే చంపారనేందుకు తగిన ఆధారాలు లేవని తీర్పులో పేర్కొంటూ రాజేష్ తల్వార్, నూపుర్ తల్వార్ లను నిర్దోషులుగా ప్రకటించింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications