వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: నక్సల్స్ అపహరించిన కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ విడుదల, ఆనందంలో కుటుంబం

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఇటీవల చోటు చేసుకున్న భీకర ఎదురుకాల్పుల తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌కు గురువారం విముక్తి లభించింది. ఐదు రోజుల తర్వాత నక్సల్స్ ఆ జవానును విడుదల చేశారు. ఈ క్రమంలో రాకేశ్వర్ సింగ్ సీఆర్పీఎఫ్ శిబిరానికి క్షేమంగా చేరుకున్నారు.

బీజాపూర్-సుకుమా జిల్లాల సరిహద్దులో ఏప్రిల్ 3న జరిగిన ఎన్‌కౌంటర్‌లో28 మంది జవాన్లు మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే, రాకేశ్వర్ సింగ్‌ను మావోయిస్టులు అపహరించుకుపోయారు. జవాను తమ వద్ద బందీగా ఉన్నట్లు ఏప్రిల్ 5న మావోయిస్టులు లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాకేశ్వర్ ఫొటోను మీడియాకు పంపించారు.

 Abducted CoBRA jawan Rakeshwar Singh Manhas released by Naxals, brought to CRPF camp Bijapur

ఓ పూరి గుడిసెలో జవాను క్షేమంగా ఉన్నట్లు ఆ ఫొటోలో కనిపించింది. ఈ క్రమంలో తమ తండ్రిని విడిచిపెట్టాలంటూ జవాను కుమార్తె చేసిన విజ్ఞప్తి మీడియా ద్వారా స్వీకరించామని మావోయిస్టులు బుధవారం ప్రకటించారు. అంతేగాక, మధ్యవర్తులను పంపిస్తే అతడ్ని విడుదల చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు సదరు జవానును గురువారం విడిచిపెట్టారు.

కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ సురక్షితంగా విడుదల కావడంతో ఆయన కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సింగ్ ఇంట్లో పండగ వాతావరణం కనిపించింది. రాకేశ్వర్ సింగ్ విడుదల సమాచారాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న ఆయన కుటుంబసభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారు ధన్యవాదాలు తెలిపారు. కాగా, రాకేశ్వర్ సింగ్ స్వస్థలం జమ్మూ. ఆయన 210వ కోబ్రా దళంలో విధులు నిర్వహిస్తున్నారు.

English summary
The Naxal group, which ambushed a team of security personnel in Chhattisgarh recently, on Thursday released Commando Battalions for Resolute Action (CoBRA) jawan Rakeshwar Singh Manhas, who was abducted after the recent Bijapur ambush.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X