‘అబీ పిక్చర్ బాకీ హై’.. పాక్‌కు భారత్ తాజా హెచ్చరిక, అసలు టార్గెట్..!!
ఆపరేషన్ సింధూర తో మొత్తం ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం గా భారత్ వాయు సేన ఉగ్రవాదుల శిబిరాల పైన మెరుపు దాడులు చేసారు. కేవలం 23 నిమిషాల్లో ఉగ్రవాదుల శిబిరాలను నేల మట్టం చేసారు. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను అంతం చేసారు. ఈ ఆపరేషన్ తరువాత పాకిస్థాన్ ప్రతీకార చర్యలు ఉంటాయని చెబుతోంది. పాక్ చర్యలను భారత్ నిశితంగా గమనిస్తోంది. పాక్ ఏ చర్యలకు దిగినా ధీటుగా తిప్పి కొట్టేందుకు సమాయత్తం అయింది. ఈ సమయంలో ఇప్పుడు జరిగింది జస్ట్ ట్రయిలర్ మాత్రమేనని.. ఇంకా అసలు సినిమా ముందు ఉందని పాక్ కు తాజాగా హెచ్చరికలు పంపింది.
పాక్ వెన్నులో టెన్షన్
ఆపరేషన్ సింధూర్ తో పాక్ లో టెన్షన్ మొదలైంది. పాక్ భూ భాగంలోని ఉగ్రవాద శిబిరాలతో పాటుగా పీఓకేలోని టెర్రర్ క్యాంప్స్ పైన భారత సైన్యం దాడులు చేసింది. పాకిస్తాన్ లోని తొమ్మది ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది జైషే మహ్మద్ అగ్ర నేతలు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. పాక్ లోని సర్జల్ క్యాంపు పైనా దాడి జరిగింది. ఈ దాడుల పైన భారత్ వ్యాప్తంగా సైన్యానికి అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి. అటు ప్రధాని మోదీ ఈ ఆపరేషన్ తదనంతర పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాక్ దాడులకు దిగే అవకాశం ఉందని అలర్ట్స్ అందుతున్నాయి. దీంతో, పాక్ ఎలాంటి చర్యలకు దిగినా తిప్పి కొట్టేందుకు భారత్ సర్వ సిద్దంగా ఉంది. అయితే, ఈ సమయంలోనే పాక్ కు తాజాగా బిగ్ వార్నింగ్ లు అందుతున్నాయి.

ప్రధాని కీలక మంత్రాంగం
ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పైన రాజకీయ నేతలతో పాటుగా ఆర్మీ అధికారులు స్పందిస్తున్నారు. తాజా పరిస్థితుల్లో ప్రధాని మోదీ విదేశీ పర్యటన రద్దు చేసుకున్నారు. కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమైంది. మధ్నాహ్నం భద్రతావ్యవహారాల కేబినెట్ సమావేశం జరగనుంది. ఆపరేషన్ సింధూర్ పైన భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ సరవణె ట్వీట్ చేశారు. 'అబీ పిక్చర్ బాకీ హై' అని ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. త్వరలోనే మరిన్ని మెరుపు దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సరిహద్దుల్లో పరిస్థితులను కేంద్రం పరిశీలిస్తోంది. పారా మిలిటరీ సిబ్బందికి సెలవులు రద్దు చేసారు. సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులు కొనసాగిస్తోంది. భారత్ సైన్యం వాటిని తిప్పి కొడుతోంది. అర్ధరాత్రి ఒంటిగంట 28 నిమిషాలకు దాడికి సిద్ధం.. గెలుపే లక్ష్యం అంటూ ఆర్మీ ట్వీట్ చేసింది. ఒంటి గంట 51 నిమిసాలకు ఆపరేషన్ ముగిసాక న్యాయం జరిగింది.. జై హింద్ అంటూ ఆర్మీ మరో ట్వీట్ చేసింది.












Click it and Unblock the Notifications