"ఆయనొక్కరే జెన్ జీ."-ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలపై కాక్రోచ్ బాస్ అభిజీత్ దిప్కే ..!

మన దేశంలో కొంతకాలంగా ఎక్కడ చూసినా జెన్ జీ (Gen Z) పదం వినిపిస్తోంది. 1995 తర్వాత పుట్టిన వారిని జెన్ జీగా పేర్కొంటూ ఇంటర్నెట్ లో యూత్ హల్ చల్ చేస్తుంటారు. తాజాగా నీట్ అక్రమాలతో పాటు సీఈసీ రాజీనామా డిమాండ్ తో ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనల్లోనూ జెన్ జీ పదం ఎక్కువగా వినిపించింది. దీంతో ప్రధాని మోడీ సైతం జెన్ జీని ఆకట్టుకునేందుకు ఇన్ స్టా లో యాక్టివ్ గా ఉండాలంటూ తన మంత్రుల్ని పదే పదే కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ హైకోర్టు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.

జెన్ జీ కోసం వ్యూహాలు మార్చేస్తున్న జగన్, చంద్రబాబు-ఢిల్లీ ట్విస్టుల వేళ..!
జెన్ జీ కోసం వ్యూహాలు మార్చేస్తున్న జగన్, చంద్రబాబు-ఢిల్లీ ట్విస్టుల వేళ..!

ఇన్నాళ్లూ జెన్ జీ ప్రతినిధులుగా భావిస్తున్న, చెప్పుకుంటున్న కాక్రోచ్ జనతా పార్టీ కీలక నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ లను ఉద్దేశించి మీరు జెన్ జీ కాదుగా అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. జంతర్ మంతర్ వద్ద నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి జాతీయ జెండా ఎగరేసిన కేసులో అరెస్టు అయి తీహార్ జైల్లో ఉన్న వీరి కస్టడీని రెండు రోజుల పాటు పొడిగిస్తూ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Abhijeet Dipke Responds to Delhi HC s Gen Z Remark on CJP Leaders With a Post Featuring PM Modi
 ఏపీలో నామినేషన్ల పొడిగింపుపై సుప్రీం కీలక ఆదేశాలు-వైసీపీకి ఊరట..!
ఏపీలో నామినేషన్ల పొడిగింపుపై సుప్రీం కీలక ఆదేశాలు-వైసీపీకి ఊరట..!

కాక్రోచ్ నేతలు అశుతోష్, సౌరవ్ ల వయస్సు అడిగి మరీ ఢిల్లీ హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ కేసులో మెరిట్ చూడకుండా కాక్రోచ్ నేతల వయస్సు గురించి హైకోర్టు ఆసక్తి చూపడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) సైతం స్పందించారు. ఎక్స్ లో చేసిన ఓ ట్వీట్లో దిప్కే.. ప్రధాని మోడీ ఫొటోను షేర్ చేస్తూ.. ఈ దేశంలో జెన్ జీగా అర్హత పొందిన ఏకైక వ్యక్తి అని వ్యాఖ్యానించారు. తద్వారా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా ఘాటుగా స్పందించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తికి, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల వ్యక్తిగత స్వేచ్ఛ కంటే వారి వయస్సుపైనే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు అనిపించిందన్నారు. ఏది ఏమైనప్పటికీ, గౌరవనీయులైన న్యాయమూర్తి గారూ, సౌరవ్ జనవరి 2000లో జన్మించారు, అంటే ఆయన స్పష్టంగా 'జెన్ జెడ్' తరానికి చెందినవారని, ఇక అశుతోష్ వయస్సు 31 ఏళ్లు. అసలు ఈ సందర్భంలో వయస్సుతో వచ్చే తేడా ఏమిటో నాకైతే అర్థం కాలేదని రాజ్ దీప్ ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+