మైండ్ బ్లాంక్: దిమ్మదిరిగే టీనేజీ అమ్మాయిల అబార్షన్ల రేటు
ముంబై: మెట్రో నగరం ముంబైలో అమ్మాయిలు అబార్షన్లను చూస్తే దిమ్మిదిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే పరిస్థితి ఉంది. ముంబై మహానగరంలో 15 ఏళ్ల లోపు వయస్సు గల టీనేజి బాలికల అబార్షన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. 2014-15 సంవత్సరంలో అంతకుముందు కంటే ఇది ఏకంగా 67 శాతం పెరిగింది.
సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ప్రకారం సుమారు 31 వేల మంది మహిళలు అబార్షన్ చేయించుకోడానికి రాగా, వాళ్లలో 1600 మంది 19 ఏళ్ల లోపువారేనని తేలింది. ఇది కేవలం లైసెన్సు ఉన్న అబార్షన్ కేంద్రాల లెక్క.

ముంబైలో లైసెన్సు ఉన్న అబార్షన్ కేంద్రాలన్నింటి నుంచి బీఎంసీ ప్రతియేటా సమాచారం సేకరిస్తుంది. 2013-14 సంవత్సరంలో 15 ఏళ్లలోపు బాలికలు 111 మంది అబార్షన్లు చేయించుకున్నారు. 2014-15 సంవత్సరంలో వీరి సంఖ్య 185కు పెరిగింది. 15-19 ఏళ్ల మధ్య ఉన్నవారి సంఖ్యలో కూడా 47 శాతం పెరుగుదల కనిపించింది.
ముఖ్యంగా ముంబైలోని అంధేరీ ఈస్ట్, అంధేరి వెస్ట్ ప్రాంతాల్లో ఎక్కువ అబార్షన్లు జరుగుతున్నాయి. సుమారు 6వేల కేసులు ఇక్కడే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications