ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్: 15 మంది నక్సల్స్ మృతి!
రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దాదాపు పదిహేను మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. సుకుమా జిల్లా దంతెమడుగు ప్రాంతంలో నక్సలైట్లకు, కేంద్ర బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఉదయం నుంచిఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ఉదయం నుంచి సాయంత్రం దాకా కాల్పులు కొనసాగాయని తెలుస్తోంది. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను కేంద్రబలగాలు సుకుమా జిల్లాలకు తరలిస్తున్నారు. ఆ మృతదేహాల కోసం మావోలు కేంద్రబలగాల పైన కాల్పులు జరిపారు.












Click it and Unblock the Notifications