గాలి ఫ్రెండ్ భీమా కథ కంచికి: ఏసీబీ దాడులు

బెంగళూరు: అవినీతి నిరోదకదళం అధికారులు (ఏసీబీ) పలు అవినీతి అధికారుల ఇండ్లు, కార్యాలయాల మీద దాడులు చేసి సోదాలు చేస్తున్నారు. లంచాలు తీసుకుని కోట్లకు కోట్ల రూపాయలు సంపాధిస్తున్నారని సమాచారం రావడంతో దాడులు చేశారు.

శుక్రవారం వేకువ జామున కర్ణాటకలోని ఐదు మంది అవినీతి అధికారల ఇండ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లికి రూ. కోట్ల విలువైన పాత నోట్లను మార్పిడి చేసి కొత్త నోట్లు ఇచ్చారని కేఏఎస్ అధికారి భీమా నాయక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

శుక్రవారం వేకువ జామున బళ్లారీ జిల్లాలోని హగరి బోమ్మనహళ్ళి సమీపంలోని మరియమ్మన హళ్ళిలోని భీమా నాయక్ ఇంటి మీద దాడి చేసి సోదాలు చేసి విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

 ACB officials raid at five places in Karnataka

భీమానాయక్ అక్రమ ఆస్తులు మొత్తం బయటకు లాగుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి, భీమా నాయక్ కు ఎప్పటి నుంచి లింక్ ఉంది ? వారికి ఏలాంటి లావాదేవీలు ఉన్నాయి ? అని ఆరా తీస్తున్నారు. అదే విధంగా కర్ణాటకలోని నలుగురు అవినీతి అధికారులు ఏసీబీ వలలో పడ్డారు.

జాతీయ రహదారుల ప్రాధికార ఇంజనీరు టీఆర్. శివరాము, కులబర్గి జిల్లా పంచాయితీ ఇంజనీరు శివలింగప్ప, తుమకూరు జిల్లా కోరటగెరె అటవి శాఖ సీనియర్ అధికారి డి. నరసింహమూర్తి, బెంగళూరు గ్రామీణ జిల్లా నెలమంగలకు చెందిన పశు వైద్య శాఖ అధికారి హెచ్.ఎం. శివప్రసాద్ ఏసీబీ అధికారుల వలలో పడ్డారు.

వీరి అక్రమ ఆస్తులు ఎంతా ? అని అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద కేఏఎస్ అధికారి భీమా నాయక్ మీదనే ఏసీబీ అధికారులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. శుక్రవారం వేకువ జామున ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరగడంతో అవినీతి అధికారులు హడలిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+