బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ACB raids: తోటపని చేసే ఉద్యోగం, కూతురు విదేశాల్లో, కొడుకు బార్ ఓనర్, ఐటీ హబ్ లో కోట్లలో ఆస్తులు, మైండ్ బ్లాక్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ చిక్కబళ్లాపురం: అతను కలెక్టర్ కాదు, ఐపీఎస్ కాదు, ఇంజనీర్ కూడా కాదు. అతను ఓ చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరు డెవలప్ మెంట్ అథారిటీ (బీడీఏ)లో తోటపని చేసే ఉద్యోగం. అయితే ఎప్పుడూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. వారంలో మూడు రకాల కార్లలో తిరుగుతున్నాడు. కూతురు విదేశాల్లో ఉంది. కొడుకు సొంతంగా బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. ఐటీ హబ్ లో శ్రీమంతులు నివాసం ఉండే ఏరియాలో రెండు భవనాలతో పాటు మొత్తం కోట్ల రూపాయల విలువైన నాలుగు భవనాలు ఉన్నాయి. కేవలం 13 రోజుల్లో రిటైడ్ కావలసిఉన్న ఆ ఉద్యోగి మీద ఏసీబీ అధికారులు పంజా విసిరారు. తోటపని చేస్తున్న వ్యక్తి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. బీడీఏ ఇంజనీర్ దగ్గర అసిస్టెంట్ గా తిష్టవేసిన తోటమాలికి బీడీఏలో జరిగిన అక్రమాలు, అక్రమ డీనోటిఫికేషన్ల గురించి సమాచారం తెలుసని ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Shock: మరిది మర్మాంగం మీద వేడినీళ్లు పోసిన వదిన, ఆసుపత్రిలో లబోదిబో, మరది భార్య ఎంట్రీ !Shock: మరిది మర్మాంగం మీద వేడినీళ్లు పోసిన వదిన, ఆసుపత్రిలో లబోదిబో, మరది భార్య ఎంట్రీ !

బీడీఏలో తోటపని చేస్తున్న శివలింగయ్య

బీడీఏలో తోటపని చేస్తున్న శివలింగయ్య

బెంగళూరు డెలవప్ మెంట్ అథారిటీ (BDA)లో శివలింగయ్య (60) అనే ఆయన తోటపని చేసే ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శివలింగయ్య ఎప్పుడూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. శివలింగయ్యకు పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలు ఉన్నాయి. తోటపని చెయ్యకుండా బీడీఏలోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఇఇ) దగ్గర అసిస్టెంట్ గా శివలింగయ్య సెటిల్ అయిపోయాడు.

పంజా విసిరిన ఏసీబీ అధికారులు

పంజా విసిరిన ఏసీబీ అధికారులు

శుక్రవారం కర్ణాటకలోని 80 ప్రాంతాల్లో 21 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు చెందిన ఆస్తులు మీద ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. బెంగళూరు నగరంలో కూడా అవినీతి అధికారులకు చెందిన ఆస్తుల గురించి ఏసీబీ అధికారులు కూపీలాగారు. అయితే బీడీఏ లో తోటపని చేస్తున్న శివలింగయ్య ఇంటి మీద ఏసీబీ అధికారులు దాడులు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

సార్ కు రూ. కోట్ల విలువైన ఆస్తులు

సార్ కు రూ. కోట్ల విలువైన ఆస్తులు

బీడీఏలో తోటపని చేసే శివలింగయ్యకు చెందిన ఆస్తుల చిట్టా తెలుసుకున్న ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. ఐటీ హబ్ బెంగళూరులోనే నాలుగు ఇండ్లు ఉన్నాయని వెలుగు చూసింది. బెంగళూరు నగరంలో శ్రీయంతులు ఎక్కువగా నివాసం ఉంటున్న జేపీ నగర్ లో రెండు కట్టడాలు, కుమారస్వామి లేఔట్, దోడ్డకల్లసంద్రలో ఒక్కొక్కటి ఇండ్లు ఉన్నాయని ఏసీబీ అధికారులు అన్నారు.

విదేశాల్లో కూతురు, కొడుకు బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్

విదేశాల్లో కూతురు, కొడుకు బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్

శివలింగయ్య మూడు రకాల కార్లలో తిరుగుతున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన శివలింగయ్య కూతురు విదేశాల్లో ఉంటున్నదని, ఆయన కొడుకు బెంగళూరులో సొంతంగా బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతున్నాడని బీడీఏ అధికారులు తెలిపారు. ఐటీ హబ్ లో శ్రీమంతులు నివాసం ఉండే ఏరియాలో రెండు భవనాలతో పాటు మొత్తం కోట్ల రూపాయల విలువైన నాలుగు భవనాలు ఉన్నాయని అధికారులు అన్నారు.

13 రోజుల్లో రిటైడ్ అయ్యే టైమ్ లో ?

13 రోజుల్లో రిటైడ్ అయ్యే టైమ్ లో ?


దొడ్డకల్లసంద్రలో ఓ ఖాలీ స్థలం, రామనగర జిల్లా చెన్నపట్టణలో 1 ఎకరా 9 గుంటల వ్యవసాయ భూమి ఉందని, అర్దకేజీకి పైగా బంగారు నగలు, 700 గ్రాముల వెండి వస్తువులు, 10 లక్ష్లల విలువైన ఇంటి సామాగ్రి, మూడు కార్లు, రెండు బైక్ లు, బ్యాంకు బ్యాలెన్స్ లు ఉన్నాయని ఏసీబీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కేవలం 13 రోజుల్లో రిటైడ్ కావలసిఉన్న చిన్న ఉద్యోగి శివలింగయ్య ఇళ్లల్లో ఏసీబీ అధికారులు పంజా విసిరారు. తోటపని చేస్తున్న శివలింగయ్యకు కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నాయని వెలుగు చూడటం ఐటీ హబ్ బెంగళూరు నగరంతో పాటు బీడీఏలో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
ACB raids: The Anti-Corruption Bureau (ACB) in Karnataka has found that Shivalingaiah, a gardener in Bangalore Development Authority (BDA), owns four houses in different parts of the city and properties worth crores of rupees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X