వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ACB: ఏసీబీ రద్దు, సుప్రీం కోర్టుకు వెళ్లే విషయంలో సీఎం క్లారిటీ, మాకు సంబంధం లేదు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/దోడ్డబళ్లాపురం: అవినీతి నిరోదక శాఖ (ACB)ని హైకోర్టు రద్దు చెయ్యడంతో ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ స్పష్టం చేశారు. ఏసీబీని రద్దు చేసిన తరువాత ఏసీబీకి ఉన్న అధికారాలు అన్నీ లోకాయుక్తకు అప్పగించాలని మా ప్రభుత్వం డిసైడ్ అయ్యిందని సీఎం బసవరాజ్ బోమ్మయ్ క్లారిటీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్బంలలో సీఎం సిద్దరామయ్య ఏసీబీని తెరమీదకు తీసుకువచ్చారు.

Illegal affair: ఒకే కంపెనీలో ఉద్యోగం, మిస్ డ్ కాల్ తో భర్తను చంపించిన భార్య, స్కెచ్ రివర్స్, ఢమాల్ !Illegal affair: ఒకే కంపెనీలో ఉద్యోగం, మిస్ డ్ కాల్ తో భర్తను చంపించిన భార్య, స్కెచ్ రివర్స్, ఢమాల్ !

 అప్పటి సిద్దరామయ్య ప్రభుత్వం

అప్పటి సిద్దరామయ్య ప్రభుత్వం

గతంలో సిద్దరామయ్య ప్రభుత్వం (కాంగ్రెస్) కర్ణాటకలో అధికారంలో ఉన్న సందర్బంలో ఏసీబీని స్థాపించారు. లోకాయుక్తను నీరుకార్చడానికి, అవినీతి అధికారులను, వారికి అండగా ఉన్న నాయకులను కాపాడటానికి ఏసీబీని స్థాపించారని, లోకాయుక్తకు ద్రోహం చెయ్యడానికి సిద్దరామయ్య ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అప్పట్లో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.

 హైకోర్టు సంచలన తీర్పు

హైకోర్టు సంచలన తీర్పు

ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా సిద్దరామయ్య ప్రభుత్వం మాత్రం ఏసీబీని స్థాపించింది. అయితే సిద్దరామయ్య అప్పట్లో స్థాపించిన ఏసీబీని ఇటీవల కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెలుతోందని చాలా మంది అనుకున్నారు. అయితే అలాంటి ఊహాగానాల విషయంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ క్లారిటీ ఇచ్చారు.

 మాకు సంబంధం లేదు

మాకు సంబంధం లేదు

ఏసీబీని రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును మేము సుప్రీం కోర్టులో సవాలు చెయ్యమని బుధవారం కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. ఇప్పటికే ఏసీబీ తీర్పు విషయంలో కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కనకరాజ్ కు, మా ప్రభుత్వానికి ఏలాంటి సంబంధం లేదని బసవరాజ్ బోమ్మయ్ చెప్పారు.

 మా నిర్ణయం ఇదే

మా నిర్ణయం ఇదే

లోకాయుక్తకు ఇంకా ఎక్కువ అధికారులు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్దంగా ఉందని, ఇదే విషయంలో మంత్రివర్గంలో కూడా చర్చ జరిగిందని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వం తీసుకు వచ్చిన ఏసీబీ రద్దు చెయ్యడం వలన మనకు ఎలాంటి నష్టం లేదని బీజేపీ నాయకులు కొందరు అంటున్నారని తెలిసింది.

English summary
ACB: We will not go to Supreme Court on ACB dismiss case, says Karnataka CM Basavaraj Bommai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X