Chandigarh University: బాత్‌రూమ్ వీడియోల లీక్ కేసులో నిందితుల అరెస్ట్.. అవి ఒక్కరివే..

పుకార్లు ఎంత పని చేస్తాయో మరోసారి నిరూపితమైంది. అభ్యంతరకర వీడియోలు వైరల్ అవుతున్నాయని వచ్చిన పుకార్లు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. పంజాబ్‌ మొహాలీలోని చండీగఢ్‌ యూనివర్సిటీలో అభ్యంతరకర వీడియోల వ్యవహారం తీవ్ర అలజడి సృష్టించింది. యూనివర్సిటీ హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థిని.. పలువురు విద్యార్థినుల ప్రైవేట్‌ వీడియోలను మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించి, మరో యూనివర్సిటీలో చదివే తన స్నేహితుడికి పంపించిందని వార్తలు గుప్పుమన్నాయి.

తీవ్ర ఉద్రిక్తత

తీవ్ర ఉద్రిక్తత


అతను వాటిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడని, మొత్తంగా 60కి పైనే వీడియోలు వైరల్‌ అవుతున్నాయంటూ పుకార్లు వచ్చాయి. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థినులు యూనివర్సిటీ ప్రాంగణంలో ధర్నాకు దిగారు. పెద్ద సంఖ్యలో విద్యార్థినులు శనివారం అర్ధరాత్రి నుంచి వర్సిటీ ప్రాంగణంలోకి ఆందోళన చేశారు. దీంతో యూనివర్సిటీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అస్సలు ఏం జరిగింది..

అస్సలు ఏం జరిగింది..

ఓ హాస్టల్‌ వార్డెన్‌ వీడియో లీకేజీల గురించి సదరు యువతిని నిలదీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ కథ మొదలైంది. పుకార్లను నమ్మవద్దంటూ యూనివర్సిటీ అధికారులు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత వీడియోలు లీకైనట్లు వార్తలు వచ్చాక కొందరు విద్యార్థినులు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఆత్మహత్యాయత్నంలో పలువురి పరిస్థితి విషమయంగా ఉందంటూ సోషల్‌ మీడియాలో కొందరు పెట్టిన పోస్టులను
నమ్మోద్దని పోలీసులు ఖండించారు.

బాత్రూంలో స్నానం చేస్తున్న వీడియో

బాత్రూంలో స్నానం చేస్తున్న వీడియో


యూనివర్సిటీ హాస్టల్‌లో ఉంటున్న ఒక విద్యార్థిని బాత్రూంలో స్నానం చేస్తూ తన ఫోన్‌లో రికార్డు చేసుకొని, హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపించినట్లు యూనివర్సిటీ అధికారులు వివరిస్తున్నారు. ఆమె ఫోన్‌లోని అభ్యంతరకర వీడియోలను చూసిన సహచర విద్యార్థినులు, ఆమె తమవి కూడా రికార్డు చేసి అలాగే పంపి ఉంటుందని ఆందోళనకు గురయ్యారని చెప్పారు.

అరెస్టు

అరెస్టు

పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను కూడా హిమాచల్‌ ప్రదేశ్‌లో అరెస్టు చేశామని అదనపు డీజీపీ గురుప్రీత్‌కౌర్‌ దేవ్‌ తెలిపారు. ఇప్పటిదాకా దర్యాప్తులో నిందితురాలికి చెందిన ఫోన్‌లో ఆమెకు సంబంధించిన నాలుగు వీడియోను గుర్తించామని చెప్పారు. ఇతర విద్యార్థినుల వీడియోలను రికార్డు చేయలేదని స్పష్టం చేశారు. మరోవైపు యూనివర్శింటి అధికారులు సెలవులు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+