ఏం చేయాలో తెలియక చంపేశా, ప్రద్యుమన్ కాకుంటే..: ‘రేయాన్’ నిందితుడు

Subscribe to Oneindia Telugu
Ryan School Pradyumn’s Case : Too Many Questions Remain Unanswered

న్యూఢిల్లీ: రేయాన్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమన్‌ కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట ప్రద్యుమన్‌ని బస్సు కండక్టరే హత్య చేసి ఉంటాడని గతంలో పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు రేయాన్‌ పాఠశాలకు చెందిన 11వ తరగతి విద్యార్థే ప్రద్యుమన్‌ను హత్య చేశాడని మంగళవారం సీబీఐ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

కీలక మలుపు: పరీక్ష వాయిదా వేసేందుకే ప్రద్యుమన్ హత్య, సీనియరే హంతకుడు

ఏం అర్థంకాక చంపేశాడు..

ఏం అర్థంకాక చంపేశాడు..

కాగా, ఈ మేరకు నిందిత విద్యార్థిని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు సీబీఐ అధికారులు. పరీక్షలు వాయిదా వేసేందుకు తనకు ఏం చేయాలో అర్థంకాక అలా చిన్నారిని చంపేశానని నిందితుడు సీబీఐ విచారణలో తెలిపినట్లు సమాచారం.

గొంతుకోసి దారుణంగా..

గొంతుకోసి దారుణంగా..

ప్రద్యుమన్‌తో ముఖ్యమైన విషయం చెప్తానని చెప్పి తరగతి గదిలోకి తీసుకెళ్లానని ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే గొంతు కోసేశానని అతను విచారణలో చెప్పినట్లు తెలిసింది. అంతేగాక, నిందితుడు 3 నిమిషాల్లోనే ప్రద్యుమన్ ను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని సమాచారం.

కాగా, ప్రద్యుమన్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడైన తోటి సీనియర్‌ విద్యార్థి(16)ని బాలల న్యాయస్థానం 3 రోజుల సీబీఐ కస్టడీకి తరలించింది. ఈ నేరం తానే చేసినట్లు నిందితుడు తన తండ్రి, మరో స్వతంత్ర సాక్షి, దర్యాప్తు సంస్థ సంక్షేమాధికారి ఎదుట అంగీకరించినట్లు న్యాయస్థానానికి సీబీఐ నివేదించింది.

ప్రద్యుమన్ కాకుంటే మరొకరు..

ప్రద్యుమన్ కాకుంటే మరొకరు..

అయితే ఆరోజు రేయాన్‌ పాఠశాలలో ప్రద్యుమన్‌ కాకపోయినా ఎవరో ఒకరు కచ్చితంగా చనిపోయేవారేనని, నిందితుడు మొత్తానికి ఎవరో ఒకరిని చంపాలని కత్తితో పాఠశాలకు వచ్చాడని సీబీఐ అధికారులు వెల్లడించారు. దురదృష్టవశాత్తు ప్రద్యుమన్‌ అక్కడే ఉండడంతో అతను బలైపోయాడని పేర్కొన్నారు.

నిందితుడ్ని ఉరితీయాల్సిందే..

నిందితుడ్ని ఉరితీయాల్సిందే..

నిందితుడిగా ఉన్న సీనియర్‌ విద్యార్థిని ఉరితీయాలంటూ ప్రద్యుమన్‌ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు తన కుమారుడిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడగాలనుకుంటున్నానని చిన్నారి ప్రద్యుమన్‌ తల్లి కన్నీరుమున్నీరైంది.

ఏం పాపం తెలియదంటూ నిందితుడి పేరెంట్స్..

ఏం పాపం తెలియదంటూ నిందితుడి పేరెంట్స్..

కాగా, తమ కుమారుడికి ఏ పాపం తెలియదని, అతడు చిన్నారిని హత్య చేయలేదని నిందితుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటివరకు ప్రధాన నిందితుడిగా ఉన్న బస్సు కండక్టర్‌ అశోక్‌ కుమార్‌కు ఇప్పుడే క్లీన్‌ చిట్‌ ఇవ్వలేమని సీబీఐ తెలిపింది. అతడిపై వచ్చిన ఆరోపణలను కూడా విచారిస్తున్నామని స్పష్టం చేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Central Bureau of Investigation's (CBI) remand application which alleges that the Class 11 student has admitted to killing seven-year-old boy Pradyuman Thakur in Gurugram's Ryan International School.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి