వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా డాక్టర్‌పై యాసిడ్: ప్రేమకు నో చెప్పిందని తోటి వైద్యుడే..

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇద్దరు బైకర్లు దేశ రాజధాని న్యూఢిల్లీలో 30 ఏళ్ల మహిళా డాక్టర్ పైన రెండు రోజుల క్రితం యాసిడ్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పోలీసులు ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యురాలి పైన రాజౌరీ గార్డెన్ ప్రాంతంలో దాడి జరిగింది.

వీడియో ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ దాడిలో ఓ మైనర్‌తో పాటు నలుగురు పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు అందరు కూడా 17 నుండి 22 ఏళ్ల మధ్య ఉన్న వారిగా భావిస్తున్నారు. ఆమె పైన దాడికి పాల్పడ్డ వారు దోపిడీకి పాల్పడినట్లుగా తెలుస్తోంది.

పోలీసులు ఆమెకు చెందిన హ్యాండ్‌బ్యాగ్‌ను ఖ్యాళా నుండి బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దర్ని ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. 17 ఏళ్ల మైనర్ బాలుడికి డాక్టర్ బాగా తెలుసునని పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ఆమె పైన యాసిడ్ దాడి చేయించింది ఆమెతో పాటు విద్యను అభ్యసించిన డాక్టరే. తన ప్రేమను అంగీకరించినందుకు కక్ష కట్టిన ఆ వైద్యుడు కొందరు సహాయంతో యాసిడ్ దాడి చేయించాడు.

acid attack: Cops detain two, suspect involvement of minor

కాగా, ఇద్దరు బైకర్లు దేశరాజధాని ఢిల్లీలో 30 ఏళ్ల మహిళా వైద్యురాలిపైన యాసిడ్ దాడికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ వద్ద ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి యాసిడ్ చల్లిన విషయం తెలిసిందే. దీంతో మహిళ ముఖంపై, మెడపై కాలిన గాయాలయ్యాయి.

మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో డాక్టర్ అమృతా కౌర్ స్కూటీపై ఈఎస్ఐ ఆస్పత్రికి వెళ్తుండగా బైక్‌పై ఇద్దరు వక్తులు వచ్చి ఆమెపై యాసిడ్ చల్లారు. ఆ తర్వాత వాళ్లు ఆమె చేతి సంచీని లాక్కుని ప్రధాన మార్కెట్ గుండా పారిపోయారు. స్థానికులు ఆమెకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

పోలీసులకు సమాచారం అందించారు. వైద్యురాలిపై విసిరింది పూర్తిగా యాసిడ్ కాదని, అటువంటి స్వభావం కలిగిన ద్రవమని పోలీసులు చెప్పారు. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆమెను ఎయిమ్స్‌కు తీసుకుని వెళ్లారు. ఆగంతకులు నల్లటిపై బైక్‌పై వచ్చి దాడికి పాల్పడ్డారు.

English summary
Two days after a doctor was injured in an acid attack in Rajouri Garden, the Delhi Police on Thursday morning detained two accused in connection with the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X