యువతిపై యాసిడ్ దాడి: వేధింపులతో ఆత్మహత్య

Acid attack on 17 years old girl in Meerut
మీరట్: కళాశాలలో పరీక్ష ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న 17ఏళ్ల యువతిపై బైకుపై వచ్చిన ముగ్గురు యువకులు యాసిడ్ దాడి చేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లోని మన్వాలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

బాధిత యువతి ముఖం పూర్తిగా కాలిందని, అయితే కళ్లు మాత్రం సురక్షితంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెప్పారు. కళాశాల నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో యువతిపై ముగ్గురు దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. నిందితులను తొందరలోనే పట్టుకుంటామని చెప్పారు.

ప్రేమ పేరుతో యువతిపై కిరోసిన్ దాడి

తన ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు తను ప్రేమించిన యువతిపై కిరోసిన్ పోసి నిప్పటించిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా ప్రకాశం బజార్‌లో చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ఆ యువకుడు యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడు. మంగళవారం కూడా మళ్లీ ప్రేమ ప్రస్తావన తీసుకురావడంతో యువతి తిరస్కరించింది.

దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువకుడు వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఆ యువతిపై పోసి నిప్పింటించాడు. తీవ్ర గాయాలపాలైన యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. భాధిత యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలు బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది.

మరో ఘటనలో ప్రేమ వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కృష్ణా జిల్లాలోని విజయవాడలో జరిగింది. ప్రేమ పేరుతో గత కొంత కాలంగా ఆ యువకుడు బాధిత యువతిపై వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఆ యువకుడి వేధింపులు తాళలేక కొన్ని రోజులుగా బాధిత యువతి ఇంట్లోని ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితునిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+