బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో ఆర్ టీసీ లేడీ కండెక్టర్ పై యాసిడ్ దాడి, 6 నెలల క్రితమే, ఇంటి సమీపంలో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఉద్యోగానికి వెలుతున్న ఆర్ టీసీ మహిళా కండెక్టర్ మీద గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశాడు. తీవ్రగాయాలైన మహిళా కండెక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరు నెలల క్రితమే ఇదే మహిళా కండెక్టర్ మీద మొదటిసారి యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడిలో తీవ్రగాయాలైన లేడీ కండెక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని పోలీసులు తెలిపారు. ఈ సారి ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు లేడీ కండెక్టర్ మీద యాసిడ్ పోసి పరారైనారు.

పెళ్లి కాని ఆంటీ, ఎర్రగా బుర్రగా బలంగా ఉందని, దుబాయ్ లో కంపెనీలు, ఎండీకి పంగనామాలు, ఎస్కేప్!పెళ్లి కాని ఆంటీ, ఎర్రగా బుర్రగా బలంగా ఉందని, దుబాయ్ లో కంపెనీలు, ఎండీకి పంగనామాలు, ఎస్కేప్!

బీఎంటీసీ బస్సు కండెక్టర్

బీఎంటీసీ బస్సు కండెక్టర్

బెంగళూరు నగరంలోని బాగల్ కుంటే పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందిరా బాయి (35) అనే మహిళ నివాసం ఉంటున్నారు. బెంగళూరు నగరంలో నిత్యం సంచరించే ఆర్ టీసీ (బీఎంటీసీ సిటీ బస్సు) బస్సులో ఇందిరా బాయి కండెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు. పిణ్యా బస్ డిపోలో ఇందిరా బాయి విధులు నిర్వహిస్తున్నారు.

ఇంటి సమీపంలో బైక్ లో !

ఇంటి సమీపంలో బైక్ లో !

గురువారం వేకువ జామున 5. 45 గంటల సమయంలో ఇందిరా బాయి ఉద్యోగానికి ఇంటి నుంచి బయలుదేరారు. ఇంటి నుంచి బయలుదేరి వెలుతున్న సమయంలో మార్గం మధ్యలో బైక్ లో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బాటిల్ లో యాసిడ్ తీసుకొచ్చి ఇందిరా బాయి మీద పొసి అక్కడి నుంచి పరారైనారు.

ముఖం, చేతులకు గాయాలు

ముఖం, చేతులకు గాయాలు

యాసిడ్ దాడితో ఇందిరా బాయి ముఖం, ఎడమ చేతికి తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆమెను సప్తగిరి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఇందిరా బాయి నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

ఆరు నెలల ముందే యాసిడ్ దాడి

ఆరు నెలల ముందే యాసిడ్ దాడి

తమకూరుకు చెందిన ఇందిరా బాయి మీద ఆరు నెలల క్రితం యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడి ఎవరు చేశారు అనే విషయం తెలియడం లేదని, కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు. ఇందిరా బాయి మీద రెండోసారి యాసిడ్ దాడి జరగడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాతకక్షల కారణంగా యాసిడ్ దాడి జరిగిందా ? మరేమైనా కారణాలు ఉన్నాయా అని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Unidentified men threw acid on a 35-year-old woman in Bengaluru. Indira Bhai working as BMTC bus conductor Peenya depot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X