Actor: ఫేమస్ టీవీ సీరియల్ టీమ్ కు సినిమా చూపించిన పోలీసులు ?, అర్దరాత్రి ఏం జరిగిందంటే !
బెంగళూరు: ప్రముఖ టీవీలో ప్రసారం అవుతున్న టీవీ సీరియల్ టీమ్ సభ్యులు మద్యం మత్తులో గొడవ చేశారని కేసులు నమోదు అయ్యాయని వార్తలు ప్రసారం కావడం హాట్ టాపిక్ అయ్యింది. జీ టీవీలో ఫేమస్ అయిన ఓ సీరియల్ నటీనటులు హోటల్ లో హంగామా చేశారని వార్తలు ప్రసారం అయ్యాయి. కరోనా వైరస్ నియమాలు తుంగలో తొక్కి నైట్ కర్ఫ్యూను లెక్క చెయ్యకుండా అర్దరాత్రి దాటిన తరువాత కూడా జింజర్ లేక్ వ్యూ హోటల్ లో లిక్కర్ పార్టీ చేసుకున్నారని, అక్కడికి వెళ్లిన పోలీసుల మీద చెయ్యి చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. మద్యం మత్తులో ఉన్న టీవీ సీరియల్ నటుల మీద పోలీసులు కేసులు నమోదు చేశారని, వాళ్లకు వైద్యపరీక్షలు చేయించారని వెలుగు చూసింది. అయితే ఈ వార్తలను టీవీ సీరియల్ హీరో ఖండించారు. ఫేమస్ టీవీ సీరియల్ నటుడి మీద పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. అయితే తమ మీద పోలీసులు కేసులు నమోదు చెయ్యలేదని, మాకు వైద్య పరీక్షలు చెయ్యలేదని ఆ ఫేమస్ టీవీ సీరియల్ హీరో అంటున్నాడు. అయితే గట్టిమేళం టీవీ సీరియల్ టీమ్ కు పోలీసులు గట్టిగానే సీన్ చూపించారని స్థానిక మీడియా అంటోంది.

ఫేమస్ టీవీ సీరియల్
జీ కన్నడ టీవీలో గట్టిమేళం అనే టీవీ సీరియల్ ప్రసారం అవుతోంది. గట్టిమేళం టీవీ సీరియల్ కు విపరీతమైన టీఆర్ పీ రేటింగ్ రావడంతో అందులో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు వచ్చింది. గట్టిమేళం టీవీ సీరియల్ లో రక్షిత్ ప్రధాన పాత్ర పోషించాడు. గట్టిమేళం టీవీ సీరియల్ లో రక్షిత్ ప్రధాన పాత్ర పోషించాడు.

అర్దరాత్రి హోటల్ లో ?
గట్టిమేళంతో పాటు మరో ఫేమస్ సీరియల్ లో కూడా రక్షిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వైరస్ నియమాలు తుంగలో తొక్కి నైట్ కర్ఫ్యూను లెక్క చెయ్యకుండా అర్దరాత్రి దాటిన తరువాత కూడా గట్టిమేళం టీవీ సీరియల్ నటీనటులు బెంగళూరులోని కంగేరిలోని జింజర్ లేక్ వ్యూ హోటల్ లో పార్టీ చేసుకున్నారని, అక్కడికి వెళ్లిన పోలీసుల మీద చెయ్యి చేసుకున్నారని శుక్రవారం కన్నడ మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి.

వైద్యపరీక్షలు చేయించారని ?
మద్యం మత్తులో ఉన్న గట్టిమేళం టీవీ సీరియల్ నటుల మీద పోలీసులు కేసులు నమోదు చేశారని, వాళ్లకు వైద్యపరీక్షలు చేయించారని కన్నడ మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. అయితే ఈ వార్తలను గట్టిమేళం టీవీ సీరియల్ ప్రముఖ నటుడు రక్షిత్ ఖండించారు. అయితే ఫేమస్ గట్టిమేళం టీవీ సీరియల్ నటుడు రక్షిత్ తో పాటు సాటి నటీనటుల మీద పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని కన్నడ మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి.

రాత్రి ఏం జరిగిందంటే ?
ఈ విషయంపై గట్టిమేళం టీవీ సీనియల్ నటుడు రక్షిత్ ఆయన్ను కలిసిన కన్నడ మీడియాతో మాట్లాడారు. రాత్రి త్వరగా జింజర్ లేక్ వ్యూ హోటల్ కు వెళ్లాలి అని అనుకున్నామని. హోటల్ కు వెళ్లే సరికి రాత్రి టైమ్ 13.30 దాటి పోయిందని, ఆ సమయంలో మేము ఎవ్వరూ మద్యం సేవించలేదని, పోలీసులు వచ్చి మాతో మాట్లాడి వెళ్లిపోయారని, మాకు వైద్యపరీక్షలు చేయించలేదని, దయచేసి ఈ తప్పుడు ప్రచారం ఇంతటితో మానేయాలని రక్షిత్ మనవి చేశారు. అయితే గట్టిమేళం టీవీ సీరియల్ టీమ్ కు పోలీసులు గట్టిగానే సీన్ చూపించారని స్థానిక కన్నడ మీడియా అంటోంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications