కమల్ హాసన్ రాజకీయంగా తొలిఅడుగు, నార్తె చెన్నైలో ప్రజలతో భేటీ: దద్దమ్మ ప్రభుత్వం, నోడౌట్!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: బహుబాష నటుడు, దర్శక నిర్మాత కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశంలో భాగంగా తొలి అడుగు వేశారు. శనివారం ఉత్తర చెన్నైలోని కోసాన్ థళై నదీ ప్రాంతంలో కమల్ హాసన్ పర్యటించారు. అక్కడి ప్రజలు, మత్య్సకారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుకున్నారు.

స్థానిక ప్రజలు, మత్య్సకారుల సమస్యలు అడిగి తెలుసుకున్న కమల్ హాసన్ త్వరలో మీకు మంచి రోజులు వస్తాయని, అంతవరకూ ధైర్యంగా ఉండాలని చెప్పారు. దాదాపు నాలుగు గంటల పాటు పరిసర ప్రాంతాల్లో సంచరించిన కమల్ హాసన్ ఎంతో ఓపికగా స్థానిక ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

Actor Kamal Haasan visit in North Chennai

ఉత్తర చెన్నై ప్రజలు కాలుష్యంకోరల నుంచి బయటపడటానికి చైతన్యం తీసుకురావడానికి కమల్ హాసన్ కర్ణాటక ప్లేబ్యాక్ సింగర్ టీఎం. క్రిష్ణతో ప్రత్యేకంగా పాడించిన పాటను కోసాన్ థళై నదీ ప్రాంతంలో వీడియో చిత్రీకరించి సీడీలు తయారు చేసి శనివారం విడుదల చేశారు. కమల్ హాసన్ రాజకీయంగా తొలి అడుగు వేశారనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

శుక్రవారం కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా తమిళనాడు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు. రియల్ ఎస్టేట్ ట్రేడర్లకు సహాయపడుతూ ప్రజల సమస్యలు గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వం ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే అని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్షం కారణంగా కోసాన్ థళై నదీ ప్రాంతంలో రైతులు ఇప్పటికే 1,090 ఎకరాల భూములు నష్టపోయారని కమల్ హాసన్ ఆరోపించారు.

Actor Kamal Haasan visit in North Chennai

ఎక్కడో ఉన్న చెత్తాచెదారం మొత్తం కోసాన్ థళై నదిలోకి వస్తుందోని, దీని వలన మత్య్సకారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. చేతకాని ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kamal Haasan on Saturday stepped into the field, by visiting Ennore creek, which serves as lifeline for fishermen in north Chennai. A day after he alleged that Kosasthalai river at Ennore was getting polluted and encroached.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి