వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్ సభ ఎన్నికల్లో 40 సీట్లలో ఒంటరిగా పోటీ, హీర్ కమల్ హాసన్ సంచలన నిర్ణయం, ఫ్యాన్స్ తో చర్చలు!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Kamal Has Decided To Contest Alone In 40 MP Seats | Oneindia Telugu

చెన్నై: బహుబాష నటుడు, దర్శక నిర్మాత, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చెయ్యకూడదని, ఒంటరిగా పోటీ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.

బుధవారం హీరో కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులోని 40 లోక్ సభ నియోజక వర్గాల్లో మక్కల్ నీది మయ్యం పార్టీకి చెందిన నాయకులు ఒంటరిగా పోటీ చేస్తారని అన్నారు. పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కమల్ హాసన్ తెలిపారు.

పార్టీల నాయకులు

పార్టీల నాయకులు

హీరో కమల్ హాసన్ పలు పార్టీల నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వం మీద పదేపదే విమర్శలు చేస్తున్న కమల్ హాసన్ ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకేతో కలిసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కొంత కాలం ప్రచారం జరిగింది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్ ఆధ్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ గత సంవత్సరం స్వయంగా కమల్ హాసన్ ఇంటికి చేరుకుని చర్చలు జరిపారు. అమ్ ఆధ్మీతో కలిసి మక్కల్ నీధి మయ్యం పార్టీ ఎన్నికల బరిలో ఉంటుందని పలు పార్టీల నాయకులు భావించారు.

మొదటి ఎన్నికలు

మొదటి ఎన్నికలు

రాజకీయ పార్టీ స్థాపించిన తరువాత మొదటిసారి లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతున్న సందర్బంగా ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని కమల్ హాసన్ నిర్ణయించారు. పార్టీ నాయకులు, అభిమాన సంఘాల నాయకులతో సుధీర్ఘంగా చర్యలు జరిపిన తరువాత కమల్ హాసన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు !

బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు !

ఇక తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని నిర్ణయించింది. ఇప్పటికే బీజేపీ నాయకులతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చర్చలు జరిపారని తెలిసింది.

డీఎంకే, కాంగ్రెస్ పోటీ

డీఎంకే, కాంగ్రెస్ పోటీ

తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే తన మిత్రపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తో కలిసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యింది. తమిళనాడులోని మిగిలిన పార్టీలు ఏకం అవుతాయా? విజయ్ కాంత్ సైతం తన అభ్యర్థులను ఒంటరిగా ఎన్నికల బరిలో దింపుతారా అనే విషయంపై క్లారిటీ రావలసి ఉంది.

English summary
Lok Sabha Elections 2019: Makkal Needhi Maiam will contest in all 40 seats without alliance says Kamal Haasan. Why Kamal Hassan decided to contest solo in up coming Lok sabha election 2019? here is the detail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X