నటి రమ్య: పిచ్చాసుపత్రి ముందు ధర్నా లేదు: బీజేపీ
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, బహుబాష నటి రమ్యకు విరుద్దంగా మానసిక రోగులు చికిత్స పొందుతున్న నిమ్హాన్స్ ఆసుపత్రి (పిచ్చాసుపత్రి) ముందు తాము ధర్నా చెయ్యడం లేదని బీజేపీ కర్ణాటక శాఖ నాయకులు చెప్పారు.
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, బహుబాష నటి రమ్యకు విరుద్దంగా మానసిక రోగులు చికిత్స పొందుతున్న నిమ్హాన్స్ ఆసుపత్రి (పిచ్చాసుపత్రి) ముందు తాము ధర్నా చెయ్యడం లేదని బీజేపీ కర్ణాటక శాఖ నాయకులు చివరి నిమిషంలో చెప్పారు.
రమ్య ప్రతినిత్యం బీజేపీ మీద చేస్తున్న ఆరోపణలతో ఆ పార్టీ నాయకులు విసిగిపోయారు. దేశంలోనే ప్రసిద్ధి చెందిన నిమ్హాన్స్ ఆసుపత్రి ముందు బుధవారం ధర్నా చేసి రమ్యకు తగిన బుద్ది చెబుతామని బీజేపీ నాయకులు ప్రకటించారు.

అయితే బుధవారం బీజేపీ నాయకులు యూటర్న్ అయ్యారు. చివరి నిమిషంలో తాము ధర్నాను విరమించుకుంటున్నామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ రూ. 1,000, రూ.500 నోట్లు రద్దు చేస్తున్న విషయం బీజేపీ నాయకులకు ముందే తెలుసు అని రమ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అదేవిధంగా పెద్ద నోట్లు రద్దు చేసిన తరువాత బీజేపీ నాయకుల మీద రమ్య పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఆమెకు మానసిక స్థితి బాగాలేదని, అందుకే నిమ్హాన్స్ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పిన బీజేపీ నాయకులు ఇప్పుడు కాస్త వెనకడుగు వేశారు.












Click it and Unblock the Notifications