బిజెపిలో చేరిన మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్
అందరివాడులో చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించిన రిమీ సేన్ బిజెపిలో చేరారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆమె ఆ పార్టీలో చేరారు.
న్యూఢిల్లీ: మెగాస్టార్ చిరంజీవి సరసన అందరివాడు సినిమాలో హీరోయిన్‌గా నటించిన రిమి సేన్ భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆమె బిజెపిలో చేరడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గతంలో అనేక హిందీ, బెంగాలీ, తెలుగు సినిమాల్లో ఆమె నటించారు.
తెలుగులో నీ తోడు కావాలి సినిమాలో కూడా ఆమె నటించారు. ధూమ్ వంటి సూపర్ హిట్ హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. రిమీ సేన్ స్వస్థలం పశ్చిమబెంగాల్. ముంబైకి మకాం మార్చి సినీ రంగంలో స్థిరపడ్డారు. నిర్మాతగా కూడా మారారు.

ఆమె 2003లో ప్రియదర్శన్ కామెడీ సినిమా హంగామాతో సినీ రంగ ప్రవేశం చేసారు. చివరగా ఆమె 2015లో బిగ్ బాస్ రియాలిటీ షోలో దర్శనమిచ్చారు. అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్, అక్,య్ కుమార్ వంటి హీరోల సరసన ఆమె నటించారు. అమితాబ్ బచ్చన్ బాగ్భన్‌లో కూడా ఆమె నటించారు.
ప్రధాని నరేంద్ర మోడీతో స్ఫూర్తి పొంది తాను పార్టీలో చేరినట్లు ఆమె బిజెపిలో చేరిన తర్వాత అన్నారు. మోడీతో స్ఫూర్తి పొంది పార్టీలో చేరానని, తనకు ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వహిస్తానని రిమి సేన్ అన్నారు.












Click it and Unblock the Notifications