• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీక్రెట్ 'లీక్' చేసిందనే!: నటి నగ్న ఫోటోలు తీయించి మరీ.. దిలీప్ చెప్పిన నిజం?

|

కొచ్చి: మనుషుల్ని పెట్టి మరీ హీరోయిన్‌ను లైంగికంగా వేధించి పగ తీర్చుకున్న మలయాళ హీరో దిలీప్ కక్ష వెనుక అసలు కారణాలు వెల్లడయ్యాయి. బుధవారం నుంచి అతన్ని రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో.. ఆమెపై దాడికి సంబంధించి దిలీప్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

దిలీప్‌లో చీకటి కోణాలున్నాయా?: నటిపై ఎందుకంత కక్ష, మరో నటుడికి చెక్దిలీప్‌లో చీకటి కోణాలున్నాయా?: నటిపై ఎందుకంత కక్ష, మరో నటుడికి చెక్

తన మొదటి భార్య మంజు వారియర్‌కు తన రహస్య ప్రేమాయణం గురించి తెలియజేసినందువల్లే నటిపై దిలీప్ కక్ష పెంచుకున్నట్లుగా వెల్లడైంది. ఓవైపు మంజు వారియర్ తో వివాహ సంబంధం కొనసాగిస్తూనే.. మరోవైపు కావ్యా మాధవన్ తోను దిలీప్ ప్రేమాయణం నడిపాడు. ఈ విషయాన్ని మంజు వారియర్‌కు లీక్ చేసిందన్న అక్కసుతోనే నటిని టార్గెట్ చేసినట్లు తేలింది.

ప్రేమాయణం లీక్ చేసిందనే పగ:

ప్రేమాయణం లీక్ చేసిందనే పగ:

కావ్యా మాధవన్ తో ప్రేమాయణం లీకైన తర్వాత దిలీప్ మంజు వారియర్ కు విడాకులు ఇచ్చేశారు. అప్పటినుంచి నటిపై ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నాడు. 2013లోనే ఆమెపై అత్యాచారం చేయించడానికి స్కెచ్ వేశాడు. ఇందుకోసం పల్సర్ సునీతో చర్చలు జరిపిన దిలీప్.. రూ.1.5కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడు. ఒప్పందం ప్రకారం.. రేప్ సమయంలో నటి అత్యాచార వీడియోలు, ఫోటోలు అత్యంత క్లారిటీతో చిత్రీకరించాలని చెప్పాడు.

  Man held for raping and impregnating Madhapur teenage girl
  పథకం ప్రకారం:

  పథకం ప్రకారం:

  పథకం ప్రకారమే.. ఫిబ్రవరి 17వ తేదీన తన స్నేహితులను కలిసేందుకు కొచ్చి వెళ్తున్న నటిని మార్గమధ్యలోనే కిడ్నాప్ చేశారు. ఇందుకు నటి కారు డ్రైవర్ కూడా సహకరించినట్లు తేలింది. కిడ్నాప్ అనంతరం ఆమెను లైంగికంగా వేధించారు. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ అమానుషం కొనసాగింది. అనంతరం ఆమెను కక్కనాడ్‌ సమీపంలోని పాదముద్గల్‌ వద్ద కారులోంచి బయటకు పొదల్లోకి తోసివేశారు.

  ఇలా దొరికారు:

  ఇలా దొరికారు:

  మరుసటి రోజు ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది. కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీని అరెస్టు చేసి విచారించడంతో.. దీని వెనకాల దిలీప్ అనే బడా హీరో, మరో దర్శకుడి పేర్లు బయటపడ్డాయి. సునీ ఎవరో తనకు తెలియదని దిలీప్ బుకాయిస్తున్నప్పటికీ.. జైలు నుంచి సునీ దిలీప్ కు రాసిన లేఖ బహిర్గతమవడంతో.. హీరో గారి అబద్దాలకు చెక్ పడింది. అలాగే మధ్యవర్తిత్వం కోసం దర్శకుడు నాదిర్షాతో మాట్లాడిన ఆడియో టేపులు కూడా వెలుగుచూడటంతో.. అతని ప్రమేయం కూడా వెల్లడైంది.

  ఆ విషయం తేలాలి:

  ఆ విషయం తేలాలి:

  తొలుత రెండు వారాల క్రితం దిలీప్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 12గం. పాటు విచారించారు. బుధవారం నాడు కోర్టు సమ్మతం మేరకు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. దీంతో నటిపై వ్యక్తిగత కక్షతోనే దాడి చేయించాడనే విషయం తేటతెల్లమైంది. అయితే నటిపై దాడిలో చిత్రీకరించిన ఫోటోలు, వీడియోలను దిలీప్ భార్య కావ్యా మాధవన్‌కు పల్సర్ సునీ లేదా విఘ్నేష్ చేరవేశారా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది.

  English summary
  In two days of custody Malayali Super star Accepted that he wantedly targeted Actress for leaking his secret love affair with his Kavya Madhavan
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X