బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Actress: హీరోయిన్ కేసులో లీడర్ కు షరతులతో బెయిల్, పాస్ పోర్టు ఇచ్చేయండి, తేడా వస్తే అక్కడికే !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ హీరోయిన్, మలేషియా రాయబార కార్యాలయం అధికారిని చాందినిని మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ కు బెయిల్ మంజూరు అయ్యింది. కేసు వాదనలు విన్న చెన్నై హైకోర్టు మాజీ మంత్రి మణికందన్ కు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాలను పాటించకుంటే బెయిల్ రద్దు చేస్తామని, మీ పాస్ పోర్టు పోలీసులకు ఇచ్చేయాలని మాజీ మంత్రికి చెన్నై హైకోర్టు హెచ్చరించింది. మాజీ ప్రియురాలు చాందిని దెబ్బతో జైలుకు వెళ్లిన మాజీ మంత్రి మణికందన్ ఇప్పుడు పోలీసుల విచారణకు తప్పకుండా హాజరుకావాల్సి వచ్చింది.

Illegal affair: భార్య కాళ్లు పట్టుకోవడానికి వెళ్లిన భర్త, కసక్ అని పొడిచేసిన ప్రియుడు. క్లైమాక్స్ !Illegal affair: భార్య కాళ్లు పట్టుకోవడానికి వెళ్లిన భర్త, కసక్ అని పొడిచేసిన ప్రియుడు. క్లైమాక్స్ !

 చాందిని దెబ్బ మమూలుగా లేదు

చాందిని దెబ్బ మమూలుగా లేదు

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మాజీ మంత్రి మణికందన్ తనతో కాపురం చేశాడని, ఐదు సంవత్సరాలు ఇద్దరూ సహజీవనం చేశామని నటి చాందిని ఆరోపించింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని మాజీ మంత్రి మణికందన్ తనను నమ్మించాడని, తనతో ఎంజాయ్ చేసి తరువాత మోసం చేశాడని, తనకు మూడుసార్లు అబార్షన్ చేయించాడని తమిళ హీరోయిన్, మలేషియా రాయబార కార్యాలయం అధికారిని చాందిని చెన్నైలో కేసు పెట్టడంతో ఆయనకు సినిమా కనపడింది.

 గిర్రున తిరిగి రిసార్టులో ?

గిర్రున తిరిగి రిసార్టులో ?

హీరోయిన్ చాందిని కేసు పెట్టిన తరువాత మాజీ మంత్రి మణికందన్ చెన్నై నుంచి పరారైనాడు. గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరు చేరుకున్న మణికందన్ ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని హెబ్బగుడిలోని రిసార్టులో దర్జాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో తమిళనాడు, చెన్నై సిటీ పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు.

 ఆవీడియోలతో మాజీ మంత్రి మొబైల్ ఫోన్లు ఫుల్

ఆవీడియోలతో మాజీ మంత్రి మొబైల్ ఫోన్లు ఫుల్

తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ దగ్గర ఉన్న రెండు మొబైల్ ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు. హీరోయిన్ చాందినితో ఆయన బెడ్ రూమ్ లో ఏకాంతంగా ఎంజాయ్ చేస్తున్న నగ్న వీడియోలు, ఇద్దరు మద్యం సేవిస్తున్న వీడియోలు, చాందిని బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు 100కు పైగా ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. మణికందన్ ఉపయోగించిన మరో ఫోన్ చిక్కలేదని పోలీసులు అంటున్నారని తెలిసింది.

 మాజీ మంత్రి అమాయకుడు ?

మాజీ మంత్రి అమాయకుడు ?

చాందిని మలేషియా రాయబార కార్యాలయంలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తోంది, పైగా ఆమె సినిమా నటి, మణికందన్ కు ఇంతకు ముందే పెళ్లి జరిగిందని, భార్య, పిల్లలు ఉన్నారని ఆమెకు అన్నీ తెలిసి వెళ్లింది, ఇద్దరూ ఇష్టపడి కలిసి సహజీవనం చేశారు, ఆమెను మణికందన్ మోసం చేసి, బెదిరించి లొంగదీసుకోలేదని, ఇద్దరు ఇష్టప్రకారమే ఇంతకాలం కలిసి ఉన్నారని మాజీ మంత్రి మణికందన్ న్యాయవాది కేఎస్. దినకరన్ చెన్నై హైకోర్టులో చెప్పారు. చాందిని కావాలని కక్షపెంచుకుని ఆయన్ను కేసులో ఇరికించిందని, మణికందన్ కు బెయిల్ మంజూరు చెయ్యాలని, కోర్టు విచారణకు తప్పకుండా హాజరౌతారని ఆయన తరపు న్యాయవాది కేఎస్. దినకరన్ హైకోర్టుకు మనవి చేశారు.

 బెయిల్ ఇవ్వద్దు

బెయిల్ ఇవ్వద్దు

మణికందన్ కు బెయిల్ ఇస్తే ఆయన పలుకుబడితో సాక్షాలు నాశనం చేసే అవకాశం ఉందని, తన క్లైంట్ చాందినికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, ఆయనకు బెయిల్ మంజూరు చెయ్యకూడదని చాందిని తరపు న్యాయవాది హైకోర్టుకు మనవి చేశారు. మణికందన్ కు చెందిన మొబైల్ ఫోన్ ఒకటి ఇంకా పోలీసులకు చిక్కలేదని, ఆ మొబైల్ ఫోన్ నెంబర్ నుంచి మణికందన్ చాందినికి వార్నింగ్ ఇస్తూ పంపించిన మెసేజ్ లు ఉన్నాయని ఆమె తరపు న్యాయవాది ఆరోపించారు.

 షరతులతో బెయిల్ మంజూరు

షరతులతో బెయిల్ మంజూరు

కేసు వాదనలు విన్న మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి నిర్మల్ కుమార్ తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ కు షరతులతో బెయిల్ మంజూరు చేశారు. రెండువారాల పాటు ప్రతిరోజు పోలీసుల ముందు హాజరై సంతకాలు చెయ్యాలని, సాక్షులను బెదిరించరాదని, పోలీసులకు అవసరమైప్పుడు కచ్చితంగా విచారణకు హాజరుకావాలని, చెన్నైలోని సైదాపేట్ పోలీస్ స్టేషన్ లో పాస్ పోర్టు అప్పగించాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి నిర్మల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

 మాజీ మంత్రి ఏమి చేస్తారో !

మాజీ మంత్రి ఏమి చేస్తారో !

హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని, ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మద్రాసు హైకోర్టు తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ ను హెచ్చరించింది. బెయిల్ మీద బయటకు వచ్చిన తరువాత మాజీ మంత్రి నటి చాందినితో రాజీ అవుతారా ?, లేదా కోర్టులో తేల్చుకుంటారా ? అనే విషయం వేచి చూడాలని న్యాయనిపుణలు అంటున్నారు.

English summary
Actress: Justice M. Nirmal Kumar of Chennai High court grants bail to Tamil Nadu former Minister Manikandan in a rape case booked against him on the basis of a complaint lodged by an actress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X