సంబంధం లేని వ్యక్తి సీఎం ఎలా అవుతారు? శశికళపై గౌతమి, ఆందోళన

తమిళనాట నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సినీ నటి గౌతమి మరోసారి స్పందించారు.

చెన్నై: తమిళనాట నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సినీ నటి గౌతమి మరోసారి స్పందించారు. రాష్ట్రంలో రాజకీయాలు చిందరవందరగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం తమిళనాట ప్రజల తరపున పోరాడే గొంతు లేదని అన్నారు.

ప్రజా భద్రతకు ముప్పువాటిల్లుతుందని ఆమె అన్నారు. తమిళనాడులో రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని ఓ వ్యక్తి అకస్మాత్తుగా నేను ముఖ్యమంత్రి అయి తీరుతానని ప్రకటించడం ప్రజాస్వామ్యానికే ముప్పు అని ఆమె ఘాటుగా వ్యాఖ్యనించారు.

పార్టీలో కీలక వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి పది శాతం మాత్రమే తాను మాట్లాడానని, 90 శాతం మాట్లాడితే రంగులు బయటపడతాయని చేసిన వ్యాఖ్యలు ఎంత భయంకరమైనవో అర్ధం చేసుకున్నవారికే తెలుస్తుందని ఆమె చెప్పారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కడాన్ని ఏ తమిళుడు అంగీకరించడని అన్నారు.

Actress Gautami on Tamil nadu politics

తమిళ ప్రజలు జయలలితను చూసి ఓట్లు వేశారని, ఆమెకు వేసిన ఓటును తాము అనుభవిద్దామని కొందరు భావిస్తున్నారని శశికళను ఉద్దేశించి పేర్కొన్నారు. బాధ్యతాయుత రాజకీయాలు లేనప్పుడు, ప్రజాసమస్యలు పట్టించుకోనప్పుడు ప్రశ్నించే బాధ్యత పౌరురాలిగా తనకు ఉందని ఆమె స్పష్టం చేశారు.

తాను రాజకీయాల్లోకి వస్తానా? లేదా? అన్నది సమస్య కాదని, వాస్తవాలను పక్కదోవ పట్టించేందుకు లేనిపోని వాదనలు తెరమీదికి తెస్తున్నారని ఆమె మండిపడ్డారు.
జయలలిత ఆసుపత్రిలో ఉండగా ప్రభుత్వం తరపున నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? అని ఆమె ప్రశ్నించారు.

ఒక వైపు జయలలిత తుది శ్వాసవరకు పక్కనే ఉండి సేవలు చేశామని చెప్పుకునేవారు.. ప్రభుత్వాన్ని నడిపించామని కూడా చెబుతున్నారని, అది ఎలా సాధ్యమైందని శశికళను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో ఏం జరగబోతోందోనని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని గౌతమి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+