స్టార్ హీరోయిన్‌నూ వదల్లేదు.. !!
Lok Sabha elections 2024: దేశంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈ నెల 19వ తేదీన ప్రారంభం కానుంది. మొత్తం 13 రాష్ట్రాల్లో 89 లోక్‌సభ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. జూన్ 1వ తేదీ నాటితో ఏడు దశలో పోలింగ్ ముగుస్తుంది. అదే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
రెండో విడత పోలింగ్ ఈ నెల 26వ తేదీన షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కేరళలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకేదశలో పోలింగ్ ముగస్తుంది. కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎన్నికల బరిలో నిలిచారు కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీ.

2019 నాటి ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచే విజయం సాధించిన విషయం తెలిసిందే. కేరళ పొరుగునే ఉన్న తమిళనాడులో తొలి విడతలోనే పోలింగ్ పూర్తవుతుంది. మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. ఈ ఎన్నికల్లో డీఎంకే, ఏఐఏడీఎంకే, భారతీయ జనతా పార్టీ పోటీ పడుతున్నాయి.
పోలింగ్ గడువు సమీపించిన నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు మరింత ముమ్మరం అయ్యాయి. వీఐపీల కార్లపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు ఎన్నికల సిబ్బంది. పోలీసుల సహకారంతో వాటిని విస్తృంగా తనిఖీ చేస్తోన్నారు. ఏ కారును కూడా వదట్లేదు. ప్రముఖుల వాహనాలకూ మినహాయింపేమీ ఉండట్లేదు.
ఈ క్రమంలో కేరళ నుంచి తమిళనాడుకు బయలుదేరి వెళ్లిన ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ కారును కూడా ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యక్తిగత పనుల కోసం తిరుచిరాపల్లికి వెళ్లారామె.
తిరుచిరాపల్లి శివార్లలో ఆమె ప్రయాణిస్తోన్న నంబర్ కేఎల్ 25 9009 రేంజ్ రోవర్ కారును ఎన్నికల సిబ్బంది అడ్డుకున్నారు. కారు మొత్తం తనిఖీ చేశారు. ఆ సమయంలో మంజు వారియర్ డ్రైవింగ్ సీట్‌లో కనిపించారు. ఎన్నికల సిబ్బందికి సహకరించారు. తనిఖీ అనంతరం ఎన్నికల సిబ్బంది ఆమెతో సెల్ఫీ దిగారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్‌లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications