కరోనా బారిన పడ్డ రకుల్ ప్రీత్ సింగ్: మాల్దీవుల్లో అందాల ఆరబోత: మే డే షూటింగ్ యూనిట్‌లో
ముంబై: ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా వైరస్ సోకడంతో ఆమె హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయానని ఆమె స్వయంగా తెలియజేశారు. తన అధికారిక ట్విట్టర్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్.. బాలీవుడ్ మూవీ మే డేలో నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ ఇందులో హీరో. తాజాగా ఆమెకు కరోనా వైరస్ సోకడంతో.. షూటింగ్ యూనిట్‌లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.
ఇటీవలే ఆమె మాల్దీవుల్లో పర్యటించవచ్చిన విషయం తెలిసిందే. అక్కడ ఉన్నప్పుడే ఆమెకు కరోనా వైరస్ సోకిందా? లేక.. మే డే చిత్రం షూటింగ్ సమయంలో ఆమె ఈ మహమ్మారి బారిన పడ్డారా? అనేది తెలియరావల్సి ఉంది. కరోనా వైరస్ సోకడంతో తాను ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నానని రకుల్ ప్రీత్ తెలిపారు. తన ఆరోగ్యం బాగుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ మధ్యకాలంలో తనను కలిసిన అభిమానులు గానీ, సినిమా యూనిట్ సభ్యులు గానీ వెంటనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని సూచించారు.

అభిమానుల అండదండలతో తాను త్వరగానే ఈ కరోనా వైరస్ ప్రభావం నుంచి కోలుకుంటాననే ఆశాభావాన్ని రకుల్ ప్రీత్ సింగ్ వ్యక్తం చేశారు. త్వరలోనే సినిమా షూటింగుల్లో పాల్గొంటానని అన్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ మూవీ మే డేలో నటిస్తున్నారు. ఇందులో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్‌పై ఉంది. ఈ నెల 11వ తేదీన షూటింగ్ ప్రారంభమైంది. 2022 ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది.
😊💪🏼 pic.twitter.com/DNqEiF8gLO
— Rakul Singh (@Rakulpreet) December 22, 2020
ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులకు కరోనా వైరస్ సోకింది. వరుణ్ ధావన్, నీతూ కపూర్, కృతిసనన్, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, అవును ఫేమ్ హర్షవర్ధన్ రాణే, నటి రాజేశ్వరి సచ్‌దేవ్, బాలీవుడ్ నటుడు ఆఫ్తాబ్ శివదాసని, అర్జున్ కపూర్ వంటి ప్రముఖులు దీని బారిన పడి కోలుకున్నారు. అనుపమ్ ఖేర్, అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు, హీరో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్.. వీరంతా కరోనా బారిన పడిన వారే. వారంతా కోలుకుని మళ్లీ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు. ఇటీవలే కరోనా బారిన పడ్డ కృతిసనన్, వరుణ్ ధావన్ హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications