బళ్లారి శ్రీరాములు మీద పోటీ, నటి రమ్య ఎంట్రీ, వివరాలు, ప్రత్యేక వెబ్ సైట్, స్వచ్ఛ రాజకీయాలు!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్, బహుబాష నటి, మాజీ ఎంపీ రమ్యా దూరంగా ఉన్నారు. మొదటి సారి బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు మీద పోటీ చేస్తున్న చిత్రదుర్గ జిల్లాలోని మాళకాల్మూరు శాస నభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ యోగేష్ బాబు తరపున రమ్యా ప్రచారం మొదలు పెట్టారు. స్వచ్చరాజకీయాలు కావాలంటే విరాళాలు ఇవ్వండి అంటూ రమ్యా సెంటిమెంట్ తో ఆకర్షించాలని చూస్తున్నారు.

 బళ్లారి శ్రీరాములకు పోటీ

బళ్లారి శ్రీరాములకు పోటీ

చిత్రదుర్గ జిల్లా మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గం నుంచి బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ యోగేష్ బాబు బరిలో ఉన్నారు. బళ్లారి ఎంపీ శ్రీరాములు నుంచి డాక్టర్ యోగేష్ బాబు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.

స్వచ్చ రాజకీయం

స్వచ్చ రాజకీయం

మాళకాల్మూరులో పోటీ చేస్తున్న డాక్టర్ యోగేష్ బాబు ఎన్నికల ఖర్చు కోసం విరాళాలు ఇవ్వాలని నటి రమ్య ప్రచారం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. స్వచ్చ రాజకీయాలు కావాలి అనుకునేవారు డాక్టర్ యోగీష్ బాబుకు విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని రమ్య మనవి చేస్తూ సెంటిమెంట్ ప్రయోగించారు.

బళ్లారి శ్రీరాములు వివరాలు

బళ్లారి శ్రీరాములు వివరాలు

మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ యోగేష్ బాబు కోసం విరాళాలు సేకరించడానికి ప్రత్యేక వెబ్ సైట్ లింక్ ఉంది. అందులో డాక్టర్ యోగేష్ బాబు వివరాలు, ప్రత్యర్థి, బీజేపీ ఎంపీ శ్రీరాములు వివరాలు, రమ్యాతో పాటు ఇతరులు ఇచ్చిన విరాళాల వివరాలు ఉన్నాయి.

రూ. 7.5 లక్షలు విరాళాలు

జిల్లా పంచాయితీ సభ్యుడైన డాక్టర్ యోగీష్ బాబు ఇప్పుడు శ్రీరాములకు పోటీగా బరిలో ఉన్నారు. ఆయన ఎన్నికల ఖర్చు కోసం రూ. 28 లక్షలు విరాళాలు సేకరించాలని లక్షంగా పెట్టుకున్నారు. మే 9వ తేదీ బుధవారం సాయంత్రానికి నటి రమ్యాతో పాటు 316 మంది రూ. 7, 49, 525 విరాళాలు ఇచ్చారు. బీజేపీ మీద తిరుగుబాటు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
If you believe in clean politics, I urge you to kindly contribute, because every bit counts. Here's our SM & Digital Communications Chairperson divyaspandana's appeal in support of Dr Yogesh Babu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X