హీరోయిన్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులు..హోటల్‌కు రమ్మని దారుణంగా

ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు.

తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ నటి తనని ఓ ఎమ్మెల్యే వేధిస్తున్నాడని చెప్పి సంచలనం సృష్టించింది. నటి రిని జార్జ్‌కు మలయాళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. గతంలో ఆమె జర్నలిస్ట్‌గా కూడా పని చేశారు.

Actress Rini George s Harassment Allegations Against Kerala MLA Spark Political Row

అయితే ఆమె తాజాగా ఓ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు.ఇటీవల కేరళలోని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు తనను వేధించారని, అసభ్యకరమైన సందేశాలు పంపించారని ఆరోపణలు చేయడంతో ఆమె వార్తల్లో నిలిచారు.

ఆమె ఆరోపణల ప్రకారం, ఆ రాజకీయ నాయకుడు ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి, హోటల్‌కు రమ్మని ఆహ్వానించారు. ఈ విషయాన్ని తాను ఆ పార్టీ సీనియర్లకు తెలియజేసినా పట్టించుకోలేదని రిని తెలిపారు. అయితే ఆమె ఆ రాజకీయ నాయకుడి పేరు చెప్పలేదు. అయినప్పటికీ, ఈ వివాదం కేరళ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.

అయితే, బీజేపీ మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటత్తిల్ పేరును తెరపైకి తెచ్చింది.

బీజేపీ నాయకులు ఆ వేధింపులకు పాల్పడింది రాహుల్ అని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్ యూత్ కాంగ్రెస్ పదవికి రాజీనామా చేశారు.

అయితే, రాహుల్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. నాపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తి వాటిని కోర్టు ద్వారా నిజం అని నిరూపించాలి. ఇప్పటివరకు నాపై ఎక్కడా కూడా పోలీస్ కేసు నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుతం ఈ విషయం కేరళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+