సీఎం పళనిస్వామితో నటి వరలక్ష్మి భేటీ: ఎందుకు? ఏం చర్చించారు?..

Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళ నటి వరలక్ష్మి ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామిని కలుసుకోవడం ప్రాధానత్యను సంతరించుకుంది. అన్నాడీఎంకె రాజకీయాలు అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఈ భేటీ చోటు చేసుకోవడం కొత్త చర్చలకు తావిచ్చింది. అయితే ఈ భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని భేటీ అనంతరం వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది.

ఇద్దరు ప్రేమికులు మళ్ళీ కలిసారా? తండ్రిని కాదని ప్రేమికుడికే హీరోయిన్ ఓటు ??

సినీ ఇండస్ట్రీ సహా సామాన్యులెవరైనా లైంగిక వేధింపులకు గురైతే.. వారికి అండగా నిలిచేందుకు ఇటీవల సేవ్ శక్తి అనే వ్యవస్థను వరలక్ష్మి ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై చర్చించడానికి ఆమె సీఎంను కలుసుకున్నారు. సీఎం పళనిస్వామితో భేటీ అనంతరం వరలక్ష్మి.. పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు.

actress varalaxmi meets tamilandu cm edappadi palaniswamy

లైంగిక వేధింపుల కారణంగా మహిళలు మానసికంగానూ, శారీరకంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా కోర్టులు ఏర్పాటు చేయాలని సీఎంను కోరినట్లు వరలక్ష్మి తెలిపారు. ప్రత్యేకంగా మహిళల కోసమే పనిచేసే ఈ కోర్టుల్లో 6నెలల్లోగా తుది తీర్పు వచ్చేలా చూడాలని సీఎంకు విన్నవించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా 60వేల సంతకాలు చేసిన సేవ్ శక్తి పిటిషన్‌ను ఆమె సీఎంకు అందించారు.

కాగా, గతంలో మలయాళీ భామ భావన కిడ్నాప్ కు గురై లైంగిక వేధింపులను ఎదుర్కొన్న సమయంలో.. తానూ లైంగిక వేధింపులకు గురయ్యానని వరలక్ష్మి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మహిళా రక్షణ కోసం సేవ్ శక్తి అనే సంస్థను ఆమె ఏర్పాటు చేశారు.

ఈ సంస్థ ద్వారా లైంగిక వేధింపులను ఎదుర్కొనే బాధితులకు రక్షణగా నిలవాలని ఆమె భావిస్తున్నారు.ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు.. మహిళా రక్షణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే ఉద్దేశంపై ఆమె సీఎంతో చర్చించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
actress varalaxmi meets tamilandu cm edappadi palaniswamy
Please Wait while comments are loading...