హెరాయిన్ దెబ్బ-పాక్, ఆప్ఘన్, ఇరాన్ కార్గో నిర్వహణ నుంచి తప్పుకున్న అదానీ పోర్ట్స్

ఆప్ఘనిస్తాన్ నుంచి భారీ ఎత్తున గుజరాత్ పోర్టుకు చేరిన హెరాయిన్ వ్యవహారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆప్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా తమ నిర్వహణలో ఉన్న ముంద్రా పోర్టుకు వచ్చిన హెరాయిన్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్..ఇకపై ఆయా దేశాల నుంచి కార్గో రవాణా నిర్వహించరాదని నిర్ణయం తీసుకుంది.

ఆప్ఘనిస్తాన్, ఇరాన్ తో పాటు పాకిస్తాన్ నుంచి కార్గో నిర్వహణ చేపట్టరాదని నిర్ణయించినట్లు అదానీ పోర్ట్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. నవంబర్ 15 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అదానీ పోర్ట్స్ ఆధ్వర్యంలోని ఏ పోర్టు నుంచి కూడా ఈ దేశాల నుంచి కార్గో రవాణా చేపట్టరాదని నిర్ణయించినట్లు ఆ ప్రకటన వెల్లడించింది. నేరుగా చేపట్టే కార్గో రవాణా నిర్వహణే కాకుండా ధర్డ్ పార్టీ కార్గోను కూడా తీసుకోరాదని అదానీ పోర్ట్స్ నిర్ణయించింది. ప్రస్తుతం ఏడు రాష్ట్రాల్లోని 13 పోర్టుల్లో అదానీ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇందులో గుజరాత్ తో పాటు మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఒడిశా, ఏపీ ఉన్నాయి.

Adani ports decided not to handle cargo from Iran, pakistan and afghanistan amid heroin case

నెల రోజుల క్రితం గుజరాత్ లోని ముంద్రా పోర్టులో ఆప్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా వచ్చిన కార్గో షిప్ నుంచి 2988 కేజీల హెరాయిన్ ను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత అదానీ పోర్ట్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదానీ గ్రూప్ సహకారం లేనిదే ఈ కార్గో రవాణా ఎలా జరుగుతుందన్న ప్రశ్నలు తలెత్తాయి,. దీంతో అదానీ పోర్ట్స్ ఇరుకునపడింది. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం వెలువడి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే అంగీకరించిన కార్గో నిర్వహణ పూర్తి చేయాల్సి ఉన్నందున నవంబర్ 15 నుంచి తాజా నిర్ణయం అమలుకు ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+