రామ్ దేవ్ పై గోద్రేజ్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: ప్రముఖ యోగా గురు, పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామ్ దేవ్ బాబా పై ప్రముఖ పారిశ్రామిక వేత్త, గోద్రేజ్ గ్రూప్ ఛైర్మెన్ ఆది గోద్రేజ్ తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమ విభాగం ఐఎంసీ నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ లో ఆయన మాట్లాడారు.
ఈ సందర్బంలో ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. రామ్ దేవ్ పేరు వల్లే పతంజలి నడుస్తుందన్నారు. అంతే కాని వారి ఎఫ్ఎంసీజే ఉత్పత్తులకు తమతో పోటీ లేదని ఆది గోద్రేజ్ చెప్పారు. మార్కెట్ లో ఎవరి స్థానం వారికి ఉంటుందని అన్నారు.
రామ్ దేవ్ పేరు, ఇమేజ్, పరపతి కారణంగా యోగా, ఆయుర్వేద ఉత్పత్తులు బాగున్నాయి తప్ప, మిగిలిన వాటికి అంత సీన్ లేదని తేల్చి చెప్పారు. పతంజలికి చెందిన తేనే, నెయ్యి మాత్రం మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయని అన్నారు.

విలువ ఆధారిత విభాగంలో ఆ సంస్థ వాటా చాల తక్కువ అని ఆది గోద్రేజ్ స్పష్టం చేశారు. పనిలో పనిగా రామ్ దేవ్ మీద రెండు షటైర్లు విసిరారు. డీజిల్ వాహనాల నిషేధించడాన్ని ఆది గోద్రేజ్ వ్యతిరేకించారు.
వాహనాలు నిషేధించకుండా కాలుష్యాన్ని తగ్గించడానికి, భూతాపాన్ని నిరోధించడానికి టెక్నాలజీని మెరుగుపరుచుకోవాలని సూచించారు, ఆర్ బీఐ గవర్నర్ రఘారామ్ రాజన్ పదవీకాలం పొడిగింపుపై ఆయన సానుకూలంగా స్పందించారు.
ప్రముఖ యోగా గురు రామ్ దేవ్ బాబాపై గోద్రేజ్ గ్రూప్ సంస్థల ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ దేవ్ పేరు, పరువు, పరపతి కారణంగా పతంజలి ఉత్పత్తులు అమ్మడుపోతున్నాయని అన్నారు. అంతే కాని పతంజలి ఉత్పత్తులకు అంత సీన్ లేదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications