Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిల్లల డ్రెస్సులతో పెద్దల సెల్ఫీలు- చైనాలో కొత్త సోషల్‌ ట్రెండ్‌ -News reel

చిన్నారులు వేసుకునే టీ షర్టులు, డ్రెస్సులతో మహిళలు సెల్ఫీలు దిగడం చైనాలో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. ఆ దేశంలో ఫేమస్‌ అయిన యూనిక్లో స్టోర్‌లకు యువతులు ఎగబడుతున్నారు.

ఈ స్టోర్‌లలోని చిన్నపిల్లల సెక్షన్‌లో ఉండే దుస్తులను ట్రయల్‌ వేస్తూ యువతులు దిగిన సెల్ఫీలు సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

చైనాలో ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లకు సమానమైన క్రేజ్‌ ఉన్న షియాహోంగ్షు, వీబో సోషల్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఈ ఫొటోలు విపరీతంగా షేర్‌ అవుతున్నాయి.

Adults trying on Uniqlo children's clothes హ్యాష్‌ట్యాగ్‌తో ఒక్క వీబోలోనే 68 కోట్ల సెల్పీలు షేర్‌ అయినట్లు తేలింది. ఈ ట్రెండ్‌ మీద స్పందించాల్సిందిగా యూనిక్లో స్టోర్‌ను బీబీసీ కోరగా, దాని యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

అయితే ఈ ట్రెండ్‌ కారణంగా స్టోర్‌లోని దుస్తులు పాడైపోతున్నాయన్నది ఒక్కటే కాకుండా, సన్నగా ఉన్నామని సోషల్‌ మీడియా ద్వారా చెప్పుకునేందుకు చైనీస్‌ యువత పోటీ పడుతున్న తీరుపైనా ఆందోళన వ్యక్తమవుతోంది.

గతంలో రెండు చేతులను వెనక్కి కట్టుకుని, నాభిని తాకే బెల్లి బటన్‌ ఛాలెంజ్‌(belly button challenge), ఏ4 సైజ్‌ పేపర్‌ వెడల్పుకన్నా తమ నడుము సన్నగా ఉందని చూపించే ఏ4వెస్ట్‌ ఛాలెంజ్‌(A4waist), కురుచ టాప్‌, స్లిమ్‌ జీన్స్‌ వేసుకునే బీఎం స్టైల్‌ ఛాలెంజ్‌( BM Style)ల మాదిరిగానే ఇప్పుడు ఈ పిల్లల డ్రెస్సులు వేసుకుని సెల్ఫీలు దిగే ట్రెండ్‌ చైనాలో కొనసాగుతోంది.

నైగర్‌లో అగంతకుల కాల్పులు

నైగర్‌లో దుండగుల కాల్పులు- 58మంది మృతి

టిల్లాబెరీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా జరిపిన దాడుల్లో 58మంది మరణించారని నైగర్‌ ప్రభుత్వం ప్రకటించింది.

మార్కెట్ నుంచి ప్రజలను తరలిస్తున్న నాలుగు వాహనాలపై సాయుధులైన దుండగులు కాల్పులు జరిపారని, అయితే ఇంత వరకు ఏ వర్గం కూడా ఈ కాల్పులకు తామే బాధ్యులమని ప్రకటించుకోలేదని ప్రభుత్వం వెల్లడించింది.

ప్రస్తుతం నైగర్‌ దేశంలో రెండు జిహాదీ గ్రూపులు పని చేస్తుండగా, అందులో మాలి-బుర్కినా ఫాసో సరిహద్దుల్లో ఒకటి, నైజీరియా సరిహద్దుల్లో రెండో గ్రూప్‌ యాక్టివ్‌గా ఉన్నాయి.

ఈ కాల్పుల్లో మరొక వ్యక్తి గాయపడ్డారని, రెండు వాహనాలను తగలబెట్టిన దుండగులు, మరో రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఘటన తర్వాత నైగర్‌ ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+