హైదరాబాద్‌పై నెహ్రూ Vs పటేల్: అద్వానీ మరోసారి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విలీన అంశంపై సర్దార్ వల్లభాయ్ పటేల్ - జవహర్ లాల్ నెహ్రూల మధ్య విభేదాలను భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వాని మరోసారి ప్రస్తావించారు. హైదరాబాదులో పోలీసు చర్యకు ముందు అక్కడ భారత ఏజెంట్ జనరల్‌గా పని చేసిన డాక్టర్ కెఎం మున్షీ 1967లో రాసిన పిలిగ్రిమేజ్ టు ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని అద్వాని ఉదహరించారు.
హైదరాబాద్ ఉదంతంలో ప్రత్యక్షంగా పాల్గొన్న మున్షీ రాసిన పుస్తకంలో సాయుధ చర్య గురించి ఉన్న అధ్యాయనం నెహ్రూ - పటేల్‌ల మధ్య విభేదాలకు నిదర్శనమన్నారు. పుస్తకంలోని కొన్ని అంశాలను ప్రస్తావించారు.

తమ సైన్యంహైదరాబాదు వెళ్లడానికి ముందు రక్షణపై మంత్రివర్గ సంఘం సమావేశాన్ని నెహ్రూ ఏర్పాటు చేశారని, ఈ సమావేశానికి పటేల్ కూడా వచ్చారని మున్షీ పేర్కొన్నారని అద్వాని చెప్పారు.
హైదరాబాద్ విషయంలో పటేల్ వైఖరిపై నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారని, భవిష్యత్తులో హైదరాబాదుకు సంబంధించిన అన్ని వ్యవహారాలు తాను స్వయంగా చూస్తానని చెప్పారని, దానితో అక్కడున్న వారు షాక్ అయ్యారని, పటేల్ మాత్రం మౌనంగా కూర్చున్నారని, నిర్ణయం జరగకుండానే సమావేశం ముగిసిందని మున్షీ పేర్కొన్నారని అద్వానీ బ్లాగులో తెలిపారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications