అద్వానీ పేరు మాయం: లోకసభలో వెనక సీట్లోకి

పార్లమెంట్‌లోని ఎన్డీయే చైర్మన్ గది నుంచి ఆద్వానీ పేరును తొలగించారు. ఎన్డీయే చైర్మన్ హోదాలో గత దశాబ్ద కాలంగా అదే గదిలో ఉంటున్నారు. ఆ గది బయట ఆద్వానీ, వాజ్‌పేయి పేర్లతో నేమ్ బోర్డు ఉండేది అయితే గురువారం ఆబోర్డులో ఆద్వానీ పేరు మాయమైంది. వాజ్‌పేయి పేరు మాత్రం ఉంచడం గమనార్హం. దీంతో అద్వానీ పార్లమెంట్‌లో బీజేపీకి కేటాయించిన రూంలోకి మారతారని తెలిసింది.
మరోవైపు లోక్ సభలో కూడా ఆద్వానీ ప్రధాని నరేంద్ర మోదీ పక్క సీటులో కూర్చోలేదు. మంగళవారం సభ జరిగినప్పుడు ఆయన ప్రధాని పక్క సీట్లో కూర్చున్నారు. అయితే ఈ వాళ మాత్రం రెండో వరుసలో కూర్చుంటానని ఆయన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడుతో చెప్పారు.
అయితే చివరకు వెంకయ్య నాయుడి విజ్ఞప్తితో మొదటి వరుసలో కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పక్కన కూర్చున్నారు. భోజన విరామ సమయం తర్వాత వచ్చి ఎనిమిదో వరుసలో కూర్చున్నారు.












Click it and Unblock the Notifications