లేడీ టీచర్‌తో అఫైర్: చితకబాదారు, సర్పంచ్ ఆత్మహత్య
చెన్నై: ఓ ఉపాధ్యాయురాలితో పెట్టుకున్న అక్రమ సంబంధం సర్పంచ్ ఆత్మహత్యకు దారితీసింది. ఉపాధ్యాయురాలితో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్న గ్రామ సర్పంచ్‌ని ఆమె బంధువులు చితకబాదారు. దీంతో మనస్తాపం చెందిన ఆ సర్పంచ్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా నర్సింగాపురంలో చోటుచేసుకుంది. నర్సింగాపురం గ్రామానికి సర్పంచ్‌గా వున్న మహాలింగం (64) గతంలో ఓ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆ సమయంలో ఓ మహిళా ఉపాధ్యాయురాలితో అక్రమ సంబంధం ఏర్పడింది. నాలుగేళ్ల క్రితమే ఇతను పదవీవిరమణ చేశాడు.

గత పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి మహాలింగం సర్పంచ్‌గా విజయం సాధించారు. పదవీవిరమణ చేసినప్పటికీ ఆ ఉపాధ్యాయురాలితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ విషయం ఆమె భర్తకు తెలిసి ఇంట్లోలోంచి గెంటేశాడు. రెండు రోజుల క్రితం తిరువళ్లూరులో జరిగిన వివాహానికి హాజరైన మహాలింగాన్ని ఉపాధ్యాయురాలి బంధువులు చితకబాదారు.
దీంతో మనస్తాపం చెందిన మహాలింగం సోమవారం ఉదయం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అతను మరణించాడని వైద్యులు ధృవీకరించారు.












Click it and Unblock the Notifications