న్యూఢిల్లీలోని ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయం మూసివేత: భారత్‌పై ఆరోపణలు
న్యూఢిల్లీ: భారతదేశంలో నేటి నుంచి అంటే అక్టోబర్ 1 నుంచి తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) రాయబార కార్యాలయం ప్రకటించింది. తమ దేశం పట్ల భారత్ ఆసక్తి చూపకపోవడం, దౌత్యపరంగా తగిన మద్దతు ఇవ్వకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
భారత్-ఆప్ఘనిస్థాన్ మధ్య ఉన్న చారిత్రక ద్వైపాక్షిక సంబంధాలను, అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని.. అన్ని విధాలుగా ఆలోచించే భారత్‌లో మా దౌత్య కార్యాలయం(Embassy) కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించాం. ఇందుకు మేమెంతో చింతిస్తున్నామని అని ఆఫ్ఘాన్ తాజా ప్రకటనలో స్పష్టం చేసింది.

వివిధ కారణాలతో తమ రాయబార కార్యాలయంలో సిబ్బందిని, ఇతర వనరులను భారత్ తగ్గించిందని ఆఫ్గాన్ ఆరోపించింది. వనరుల లేమీతో కార్యకలాపాలను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మరో మార్గం లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అధికారాన్ని భారత్‌కు అప్పగించే వరకు ఆఫ్ఘాన్ పౌరులకు అత్యవసర కౌన్సిలర్ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
కాగా, ప్రస్తుతం భారత్‌లో ఆఫ్ఘాన్ రాయబారిగా ఫరిద్ మముండ్జే వ్యవహరిస్తున్నారు. తాలిబన్లు ఆఫ్ఘాన్‌ను ఆక్రమించకముందు ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న అష్ఱఫ్ గని ఇతడ్ని నియమించారు. ప్రస్తుత తాలిబన్ల ప్రభుత్వంలోనూ ఫరీద్ అదే పదవిలో కొనసాగుతున్నారు. భారత్‌లో ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయంలో ట్రేడ్ కౌన్సిలర్‌గా వ్యవహరిస్తోన్న ఖాదిర్ షా కొన్ని నెలల కిందట రాయబార కార్యాలయానికి తానే ఇంఛార్జీని అంటూ భారత విదేశాంగ శాఖకు లేఖ రాశారు.
అయితే ఆఫ్ఘాన్ లో తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ ఇంకా గుర్తించలేదు. ఈ నేపథ్యంలోనే ఆ దేశ రాయబార కార్యాలయానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు. దీంతో తమ పట్ల భారత్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తమను పరిగణలోకి తీసుకోవడం లేదంటూ తాజాగా ఆఫ్ఘాన్ తన రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.












Click it and Unblock the Notifications