కాంగ్రెస్‌కు నిరాశే.. అవిశ్వాస పరీక్ష్లలో నెగ్గిన చత్తీస్‌గఢ్ సీఎం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: చత్తీస్‌గఢ్‌లో రమణ్ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈ అవిశ్వాస తీర్మానంపై చత్తీస్‌గఢ్ అసెంబ్లీలో శుక్రవారం రాత్రంతా చర్చ జరిగింది.

అనంతరం ఓటింగ్ చేపట్టగా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 38 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 48 ఓట్లు నమోదయ్యాయి. శనివారం ఉదయం 7 గంటల వరకు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మధ్య వాడివేడి వాదనలు జరిగాయి.

cm-ramansingh

బీజేపీ సారథ్యంలోని 14 నెలల రమణ్‌సింగ్ ప్రభుత్వంపై... నాలుగురోజుల శీతాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రెండోరోజైన బుధవారం కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

బీజేపీ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని రైతుల ఆత్మహత్యలు, పీడీఎస్ కుంభకోణాల ఆరోపణలు, రైతులకు బోనస్, పాత్రికేయుల అరెస్టులు, శాంతి భద్రతలు సహా పలు అంశాలను అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ లేవనెత్తింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The no-confidence motion moved by the main Opposition against the Raman Singh led Bharatiya Janata Party (BJP) government failed after a night long debate in the Chhattisgarh Assembly. Thirty-eight votes were received in favour of the motion, while 48 had cast against it on the fourth and final day of the winter session in the state Assembly.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి