బడ్జెట్ సమావేశంలో శశికళ ఆశయాల కోసం అంటూ పరువు తీశారు !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో అమ్మ జయలలిత పేరుకు బదులుగా ఇప్పుడు చిన్నమ్మ శశికళ జపం చేస్తున్నారు. గురువారం చెన్నైలోని సచివాలయంలో బడ్జెట్ సమావేశం జరుగుతున్న సమయంలో తమిళనాడు రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి డి. జయకుమార్ చిన్నమ్మ చిన్నమ్మ అంటూ శశికళ జపం చేసి విమర్శలపాలైనారు.

గురువారం ఉదయం బడ్జెట్ సమర్పించడానికి సచివాలయంలోకి వచ్చిన జయకుమార్ ను చూసి ఆందరూ ఆశ్చర్యపోయారు. బడ్జెట్ పత్రాలు ఉన్న సూట్ కేసు చేతిలో పెట్టుకుని జయకుమార్ సచివాలయంలో అడుగుపెట్టారు.

శశికళకే ఝలక్: చెప్పకుండానే దినకరన్ పోటీనా, మండిపడిన చిన్నమ్మ!

అంతే అన్నాడీఎంకే పార్టీతో సహ డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు షాక్ కుగురైనారు. బడ్జెట్ పత్రాలు ఉన్న సూట్ కేస్ మీద జయలలిత, శశికళ ఫోటోలు అతికించి తీసుకువచ్చిన జయకుమార్ వైఖరితో సొంత పార్టీ నాయకులే అసహనం వ్యక్తం చేశారు.

After Amma, Chinamma invoked during TN budget

తరువాత సభలో మాట్లాడిన ఆర్థిక మంత్రి జయకుమార్ జయలలిత, శశికళ ఆశయాల కోసం బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని, అమ్మ, చిన్నమ్మల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సంక్షేమ పథకాలు ముందుకు సాగిస్తామని పదేపదే చిన్నమ్మ జపం చేశారు.

ఆ సందర్బంలో ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న శశికళ ఆశయాలు సాధనకోసం బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని చెప్పి మంత్రి సభ పరువు తీశారని విరుచుకుపడ్డారు.

సమరానికి సై: తమిళనాడు భారీ బడ్జెట్ ! పదవి ఉంటుందా, ఊడుతుందా

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ పేరు పదేపదే చెప్పడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా అని అధికార పార్టీని సూటిగా ప్రశ్నించారు. ఆ సమయంలో అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు సెంగోట్టయ్యన్ జోక్యం చేసుకున్నారు.

అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉందని, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ పేరు ప్రస్తావించడం తప్పు ఎలా అవుతోందని సెంగోట్టయన్ ప్రశ్నించారు. ఆ సమయంలో అసహనం వ్యక్తం చేసిన స్టాలిన్ అమ్మ, చిన్నమ్మ అంటూ పదేపదే చెప్పుకోవడం అన్నాడీఎంకే పార్టీకి ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు.

సభలో ఇక ముందు చిన్నమ్మ అనే పదం ఉపయోగించరాదని స్టాలిన్ సూచించారు. బడ్జెట్ కూడా బెంగళూరు జైల్లో తయారు చేశారా ? అంటూ డీఎంకే ఎమ్మెల్యేలు వ్యంగంగా అన్నారు. మొత్తం మీద ఆర్థిక శాఖా మంత్రి జయకుమార్ బడ్జెట్ సమావేశాల్లో పదేపదే చిన్నమ్మ జపం చేసి విమర్శలపాలైనారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In typical AIADMK's sycophancy style, Tamil Nadu finance minister Jayakumar invoked Sasikala Natarajan's name while presenting the budget.
Please Wait while comments are loading...