అమ్మాయి పుట్టిందని ట్రిపుల్ తలాఖ్, మరో పెళ్లికి సిద్ధమైన భర్త!
ట్రిపుల్ తలాఖ్‌పై దేశ వ్యాప్త ఆందోళన వాతారవణం ఉండగా, ఆ కేసులు మాత్రం ఆగడం లేదు. తాజాగా, తన భార్య ఆడ బిడ్డకు జన్మనిచ్చిందనే కోపంతో ఓ భర్త ఆమెకు ట్రిపుల్ తలాఖ్ ఇస్తానని, మళ్లీ పెళ్లి చేసుకుంటానని బెదరిం
లక్నో: ట్రిపుల్ తలాఖ్‌పై దేశ వ్యాప్త ఆందోళన వాతారవణం ఉండగా, ఆ కేసులు మాత్రం ఆగడం లేదు. తాజాగా, తన భార్య ఆడ బిడ్డకు జన్మనిచ్చిందనే కోపంతో ఓ భర్త ఆమెకు ట్రిపుల్ తలాఖ్ ఇస్తానని, మళ్లీ పెళ్లి చేసుకుంటానని బెదరింపులకు గురిచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు పెళ్లయి నాలుగేళ్లు అయ్యిందని, ఆ తర్వాత 8నెలలకే పుట్టింటికి వచ్చేశానని ఆమె తెలిపింది. ఆ తర్వాత తిరిగి వెళ్లినా.. అత్తింటి వాళ్లు ప్రతిరోజూ తనను కట్నం కోసం కొట్టి, వేధించేవారని, చాలాసార్లు చంపడానికి కూడా ప్రయత్నించారని వాపోయింది.

ఇంతలో తనకు అమ్మాయి పుట్టడంతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయని ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్లు తమ పాపను కూడా స్వీకరించలేదని, ఇప్పుడు తన భర్త రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది.
ట్రిపుల్ తలాఖ్‌ను వీలైనంత త్వరగా రద్దు చేయాలని తాను ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరుతున్నానని తెలిపింది. కాగా, ట్రిపుల్ తలాఖ్ ఒక సామాజిక రుగ్మత అని, ఇలాంటివి సామాజిక అవగాహనతోనే అంతమవుతాయని ఇటీవల ప్రధాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications