బుల్లి బాయ్ లాంటిదే మరో వికృతం: ఇప్పుడు హిందూ అమ్మాయిల ఫొటోలు, టెలిగ్రామ్ ఛానల్ బ్లాక్డ్
న్యూఢిల్లీ: బుల్లీ బాయ్ యాప్ కేసు వికృత చేష్టలను మరువకముందే అలాంటి మరో వ్యవహారం వెలుగుచూడటం సంచలనంగా మారింది. కొందరు దుండగులు టెలిగ్రామ్ యాప్‌లో హిందూ అమ్మాయిల ఫొటోలను షేర్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తక్షణమే ఆ చాణల్‌ను బ్లాక్ చేసినట్లు ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు.
పోలీసు అధికారులను, రాష్ట్రాలను సమన్వయం చేసుకుంటూ దీనిపై ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. చాలా మంది యూజర్లు సదరు టెలిగ్రామ్ ఛానల్ తమ అనుమతి లేకుండా ఫొటోలను వాడుతున్నట్లు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. బుల్లీ బాయ్ యాప్ కేసును ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం ముంబైలో 21 ఏళ్ల మయాంక్ రావల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఇప్పటికే ఈ కేసులో విశాల్ కుమార్ ఝా, మరో యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిందితుల వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు పోలీసులు. నిందితుడు విశాల్ కు జనవరి 10 తేదీ వరకు పోలీస్ కస్టడీ అనుమతించారు.
Recommended Video
కాగా, ఈ నిందితులను బెంగళూరు, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, హైదరాబాద్ నగరంలోనూ ఓ మహిళా బాధితురాలు తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సదరు యాప్ లో పోస్టు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications