బురారీ తర్వాత మరో ఘోరం: కూతుర్ని చంపి.. జార్ఖండ్‌లో ఫ్యామిలీ ఆత్మహత్య

రాంచీ: న్యూఢిల్లీలోని బురారీలో 11 మంది ఆత్మహత్య కలకలం మరవకముందే జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో మరో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన ఆరుగురు ఆదివారం ఉదయం సామూహికంగా ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఝార్ఖండ్‌‌లోని హజారీబాగ్‌కు చెందిన మార్వాడీ కుటుంబానికి చెందిన ఆరుగురు ఈ దారుణానికి పాల్పడ్డారు. నరేశ్‌ తొలుత తన తల్లిదండ్రులను, భార్య, కుమారుడిని ఉరితీశాడు. అనంతరం తన కూతుర్ని గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు వారు సూసైడ్ నోట్ రాసినట్లుగా తెలుస్తోంది. సూసైడ్ నోట్ గుర్తించామని, ఈ కుటుంబం డ్రై ఫ్రూట్ షాప్ నిర్వహిస్తోందని, వ్యాపారంలో నష్టం రావడంతో తీవ్ర అఫ్పుల ఊబిలో కూరుకుపోయారని పోలీసులు తెలిపారు. కేసును అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి దర్యాఫ్తు అనంతరమే విషయం తెలుస్తుందన్నారు.

After Burari, 6 members of a family found dead in Jharkhands Hazaribagh

అప్పుల బాధ తాళలేక వీరంతా మృతి చెందినట్లు తమకు సమాచారం అందిందని, మృతదేహాల పరిస్థితి చూస్తుంటే ఆదివారం తెల్లవారు జామునే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మృతి చెందిన వారు మహావీర్ మహేశ్వరి (70), భార్య కిరణ్ మహేశ్వరి (65), నరేశ్ అగర్వాల్ (40), భార్య ప్రీతి అగర్వాల్ (38), ఇద్దరు పిల్లలు అమన్ (8), అంజలి (6).

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+