ఓటు వేసిన ఆర్బీఐ గవర్నర్: వాళ్లకు కంగ్రాట్స్..!!
Maharashtra Assembly elections polling 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. మొత్తం 288 నియోజకవర్గాల్లో పలువురు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు.
తొలి గంటలోనే గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలికవర్గం నాయకుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరి నిల్చోవడం కనిపించింది. హీరోలు, అక్షయ్ కుమార్, రాజ్‌కుమార్ రావ్, ఫజల్ అలీ, దర్శకుడు కబీర్ ఖాన్.. తొలి గంటలోనే ఓటువేసిన వారిలో ఉన్నారు.
బారామతిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సులే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో సహా పోలింగ్ కేంద్రానికి వచ్చారామె. భర్తతో, పిల్లలతో కలిసి ఓటు వేశారు. మహా వికాస్ అఘాడీ కూటమి గెలుపు ఖాయమైందని, తాము కీలకంగా వ్యవహరించబోతోన్నామని చెప్పారు.
టీమిండియా మాజీ కేప్టెన్, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య అంజలి టెండుల్కర్, కుమార్తె సారా టెండుల్కర్‌తో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారాయన. సారా టెండుల్కర్ ఓటు వేయడం ఇదే తొలిసారి.
#WATCH | Mumbai: After casting his vote, RBI Governor Shaktikanta Das says, "The arrangements (at the polling station) were very good. I congratulate the Election Commission. The elections are being held in the middle of the week, so everyone is expecting a high voter turnout." pic.twitter.com/aFDgdQnaSt
— ANI (@ANI) November 20, 2024
ఓటు వేసిన వారిలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ దంపతులు ఉన్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయన బూత్‌కు వచ్చారు. ఆ సమయంలో క్యూలైన్ లేకపోవడంతో నేరుగా ఆయన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. ఓటు వేశారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు.
ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేయడంలో అలసత్వం వహించకూడదని పేర్కొన్నారు. ఓటర్లు కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు మంచి ఏర్పాట్లు చేశారని శక్తికాంత దాస్ కితాబిచ్చారు. ఈసీ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications