Voter Turnout: ముప్పేట దాడితో దిగొచ్చిన ఈసీ- పోలింగ్ పూర్తి వివరాలు వెల్లడి...!

దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆరు దశల పోలింగ్ ముగిసింది. ఇప్పటివరకూ ఐదు దశల పోలింగ్ పూర్తి కాగా.. ఇవాళ ఆరో దశ పోలింగ్ జరిగింది. అయితే ఇప్పటికే ముగిసిన ఐదు దశల పోలింగ్ వివరాలను ఫామ్ 17సీతో సహా బయటపెట్టాలంటూ వచ్చిన డిమాండ్లకు నో చెప్తూ వచ్చిన ఈసీ.. ఇవాళ వెనక్కి తగ్గింది. తాజాగా సుప్రీంకోర్టులోనూ ఈ వివరాలు బయటపెడితే గందరగోళం నెలకొంటుందని వాదించిన ఈసీ.. తీవ్ర విమర్శలతో డేటా విడుదల చేయక తప్పలేదు.

అదే సమయంలో ఫామ్ 17సీ ద్వారా అభ్యర్ధుల పోలింగ్ ఏజెంట్లతో పంచుకున్న పోలింగ్ రోజు పంచుకున్న డేటాను ఎవరూ మార్చలేరంటూ ఈసీ తెలిపింది. ఈ డేటా అభ్యర్ధులందరికీ అందుబాటులో ఉంటుందని, అటువంటప్పుడు దీన్ని మార్చేందుకు ఎవరీ అవకాశం ఉండదని వెల్లడించింది. కౌంటింగ్ సందర్భంగా కూడా ఏజెంట్లు ఈ డేటాను తెచ్చి సరిపోల్చుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే ఓటర్ టర్నవుట్ యాప్ లోనూ అందరికీ ఈ సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపింది.

https://elections24.eci.gov.in/docs/WYKXFehhEH.pdf

after criticism ec releases voter turnout details of all completed phases

కాబట్టి ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేందుకు తప్పుడు కథనాలు, ప్రచారాలతో జరుగుతున్న ప్రయత్నాలను ఈసీ ఖండించింది. అలాగే పోలింగ్ శాతాల డేటా విడుదలలోనూ జాప్యం జరగలేదని కమిషన్ తెలిపింది. ఓటర్ టర్నవుట్ యాప్ ద్వారా డేటాను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నట్లు గుర్తుచేసింది. ఈ యాప్ లో ఉదయం పోలింగ్ ప్రారంభమై ముగిసిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు డేటా అప్ డేట్ చేస్తున్నట్లు తెలిపింది. కాబట్టి దీనిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+