ఈసారి చైనాతో పాటు మిత్రులకూ షాక్.. పొరుగుదేశాల కంపెనీలకు చెక్... తాజా ఆంక్షలివే..
గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడి తర్వాత చైనాపై వరుసగా ఆంక్షల కొరడా ఝళిపిస్తున్న కేంద్రం.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ దేశంలో విస్తృతంగా ప్రభుత్వ కాంట్రాక్టులు పొంది భారీగా ఆర్ఝిస్తున్న చైనా కంపెనీలకు చెక్ పెడుతూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం డ్రాగన్ కంపెనీలకు శరాఘాతం కానుంది. ఇప్పటికే యాప్ ల నిషేధం, విదేశీ ప్రత్యక్ష పెట్టబడుల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చైనా కంపెనీలకు ఇది మరో భారీ షాక్ కానుంది.

చైనాపై మరో పిడుగు...
చైనాతో సరిహద్దు వివాదం తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలకు ప్రతీకగా పలు నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రం... ఈ పరంపర కొనసాగిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రద్దుతో చైనా కంపెనీలపై భారీ దెబ్బకొట్టిన కేంద్రం.... ఈసారి వారిని భారత ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి తప్పిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయితే నేరుగా చైనా కంపెనీలకు అవకాశం లేదని చెప్పకుండా... భారత్ తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలకు చెందిన కంపెనీలకు భారతీయ కాంట్రాక్టుల నుంచి తప్పిస్తున్నట్లు కేంద్రం ఓ నోట్ విడుదల చేసింది. ఇందులో దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ఇది చైనాను ఉద్దేశించి తీసుకున్న నిర్ణయమే అని అర్దమవుతోంది.

భారత్ కొ్త్త ఆంక్షలివే...
కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం భారత్ తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలకు చెందిన కంపెనీలకు భారత ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామలయ్యేందుకు అవకాశం ఉండదు. ఇతర దేశాల కంపెనీలకు మాత్రం యథావిధిగా అవకాశాలు ఉంటాయి. అలాగే భారత ప్రభుత్వ కంపెనీల్లో పెట్టుబడులకు కూడా అవకాశం ఉండబోదని కేంద్రం తేల్చిచెప్పింది. సబ్ కాంట్రాక్టులకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే భారత ప్రభుత్వ సంస్ధల్లో వివిధ కాంట్రాక్టులు చేపట్టిన పొరుగుదేశాల సంస్ధలకు మాత్రం తాజా ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఇచ్చారు.

వంతపాడుతున్న వారికీ షాక్...
కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెస్తున్న ఆంక్షలతో చైనాతో పాటు ఆ దేశానికి వంత పాడుతూ భారత్ కు సమస్యలు సృష్టిస్తున్న డ్రాగన్ మిత్రులపైనా ప్రభావం పడబోతోంది. కేంద్రం ప్రకటన బట్టి చూస్తే చైనాతో పాటు ఆ దేశానికి సహకరిస్తున్న పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ పైనా ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. నేపాల్, బంగ్లాదేశ్ సంగతి ఎలా ఉన్నా ఈ ఆంక్షల ప్రభావం కచ్చితంగా చైనా, పాకిస్తాన్ పై పడుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఇకపై ఈ దేశాలకు చెందిన సంస్ధలేవీ భారత ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం కానీ, భాగస్వాములు కావడం కానీ జరగకుండా కేంద్రం ఆంక్షలు ప్రభావం చూపబోతున్నాయి.
Recommended Video

అనుమతులూ కఠినం...
కేంద్రం తాజాగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ఇకపై విదేశీ కంపెనీలు పొరుగుదేశాలకు చెందినవో కావో ముందుగా నిర్ధారించాల్సి ఉంటుంది. వీటిని బట్టి తర్వాత ప్రక్రియకు అనుమతి లభిస్తుంది. ఆయా కంపెనీల స్ధానికతను నిర్ధారించేందుకు కేంద్రం.. ఓ ప్యానెల్ ను కూడా ఏర్పాటు చేస్తోంది. ఇందులో హోం, విదేశాంగ శాఖలతో పాటు వాణిజ్య మంత్విత్వశాఖకు చెందిన ప్రతినిధులకు స్ధానం కల్పిస్తున్నారు. ఈ మూడు శాఖలు నిర్ధారించిన తర్వాతే విదేశీ సంస్ధలకు ఇకపై భారత ప్రాజెక్టుల్లో పెట్టుబడులు, భాగస్వామ్యానికి అనుమతి లభిస్తుంది. తాజా ఆంక్షల వల్ల చైనా నుంచి విద్యుత్, టెలికాం, స్టేషనరీ, లూబ్రికెంట్ సంస్ధలకు కష్టాలు తప్పకపోవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ..












Click it and Unblock the Notifications