ఇన్ఫోసిస్ బాటలోనే ఐటి కంపెనీలు: జూనియర్లకు హెచ్ 1 బీ వీసాలకు నో

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ:దేశీయ టెక్నాలజీ అవుట్ సోర్సింగ్ దిగ్గజాలు తమ వ్యూహలను మార్చుకొంటున్నాయి. అమెరికాలో కొత్త పాలసీలు అమలయ్యే లోపుగానే తమ యూఎస్ వర్క్ వీసాల్లో మార్పులు తీసుకురావాలని పలు ఐటి కంపెనీలు నిర్ణయించాయి.

తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగులకు హెచ్ 1 బీ వీసాలు ధరఖాస్తు చేయకూడదని తాము నిర్ణయించినట్టుగా ఐటి సర్వీస్ కం.పెనీ మైండ్ ట్రీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ కృష్ణకుమార్ నటరాజన్ చెప్పారు.

వీసా ధరఖాస్తులనే తగ్గించుకోవాలని నిర్ణయించినట్టుగా ఆయన చెప్పారు. మొత్తంగా ఐటి ఇండస్ట్రీలోనూ ఇదే ధోరణి కొనసాగుతోందన్నారు.

after infosys software companies Change h1b Visa Strategy

ఇన్పోసిస్ నాలుగేళ్ళ కంటే తక్కువ అనుభవమున్న ఉద్యోగులకు వీసాలు ధరఖాస్తు చేయకూడదని నిర్ణయించింది. ఇదే బాటలో మిగిలిన కంపెనీలు కూడ నడుస్తున్నాయి.

దేశీయ ఐటీ ఇండస్ట్రీకి అమెరికా ఎంతో కీలకమైన మార్కెట్ హెచ్ 1 బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించి స్థానిక ఉద్యోగులను ఎక్కువగా రిక్రూట్ చేసుకొంటున్నట్టు నటరాజన్ చెప్పారు.

ఐటీ కంపెనీలు గత ఏడాది ఇండియాలో లక్షమందికి జాబ్ ఆఫర్స్ ఇస్తే ఈ ఏడాది కేవలం 60 వేల మందినే తీసుకొన్నాయి. ఇక్కడ క్యాంపస్ రిక్రూట్ మెంట్ తగ్గించి అమెరికాలో లోకల్ టాలెంట్ ను నియమించుకొంటున్నట్టు ఐటి కంపెనీలు తెలిపాయి.

టాటా సర్వీసెస్ , ఇన్పోసిస్, విప్రో కంపెనీలు అమెరికాలో ఉద్యోగాల నియమకాలను పెంచాయని సమాచారం. ఈ కంపెనీలు గత ఏడాది వరకు ఇండియన్ గ్రాడ్యుయేట్లనే ఎక్కువగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు తీసుకొనేవి. ఈ ఏడాది మాత్రం ట్రెండ్ ను మార్చాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
india's technology outsourcing giants, unnerved by the administration of President Donald Trump, are changing their strategy on U.S. work visas even before new policies are implemented.
Please Wait while comments are loading...